కాసేపట్లో గాంధీ ఆస్పత్రికి వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కరోనా నేపథ్యంలో ఆస్పత్రిలోని సౌకర్యాలను ఆయన పరిశీలించనున్నారు.

వైద్య ఆరోగ్య శాఖను కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆరే చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏడున్నర సంవత్సరాల తరువాత ముఖ్యమంత్రి హోదాలో గాంధీ ఆస్పత్రిని మొదటిసారి సందర్శిస్తున్నారు.

మద్యాహ్నం 1 గంటకు గాంధీ ఆస్పత్రికి చేరుకుని అక్కడి పరిస్థితులను సమీక్షిస్తారు. తెలంగాణ లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సీజన్ కొరత లేకుండా చూడాలని తెలిపారు.