తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం 6 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు, వరదలకు సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, పరేడ్ గ్రౌండ్స్ సభపై మాట్లాడతారా అన్న ఉత్కంఠ నెలకొంది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) సాయంత్రం 6 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు, వరదలకు సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అంతకుముందు రాష్ట్రంలో వర్షాల పరిస్థితి, చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు సీఎం కేసీఆర్. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ (imd) . రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 

రాష్ట్రంలోని ఈశాన్య, వాయువ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బైంసాలో జనావాసాల్లో వరద నీరు ముంచెత్తింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. హైద్రాబాద్ లో కూడా వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నీలిచింది.

ALso REad:Telangana Rains: తెలంగాణలో కుండపోత.. ఆ 8 జిల్లాలకు రెడ్ అలర్ట్.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి..

వర్షాలపై తెలంగాణ సీఎం కేసీఆర్.. సీఎస్ సోమేష్ కుమార్ (somesh kumar) సహా ఇతర అధికారులతో రెండు రోజుల క్రితం మాట్లాడారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రులు జిల్లాల్లోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కూడా కోరారు. రాష్ట్రంలోని అధికారులతో వరద సహాయక చర్యలపై సీఎస్ సోమేష్ కుమార్ అధికారులతో సమీక్షించాలని సీఎం ఆదేశించారు.

భారీ వర్షాలు కురుస్తుండంతో సింగరేణి (singareni) ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తికి కూడా అంతరాయం ఏర్పడుతుంది. వర్సపు నీరు చేరడంతో ఓపెన్ కాస్టుల్లో విధులకు అంతరాయం ఏర్పడుతుంది. సింగరేణి వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. గోదావరి నదిలో వరద నీరు రావడంతో రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. పలు మీడియం, మైనర్ ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చి చేరుతుంది. దీంతో కొన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ కూడా బయటకు రావొద్దని కూడా అధికారులు ప్రజలను కోరుతన్నారు.