ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణ  సీఎం కేసీఆర్. మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు దేశాన్ని నాశనం చేసిందని.. బీజేపీ ప్రభుత్వం ఏ రంగానికి న్యాయం చేయలేదని కేసీఆర్ మండిపడ్డారు. సంగతి చూస్తాం అంటున్నారని.. ఏం చూస్తారంటూ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

మోడీ ప్రభుత్వానికి పిచ్చి ముదరుతోందని.. మోడీ ప్రభుత్వం పిచ్చి పిచ్చి పాలసీలు తెచ్చిందంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏడాది పాటు రైతుల్ని ఏడిపించారని.. రైతుల్ని అవమానించారని, గుర్రాలతో తొక్కించారని సీఎం ఎద్దేవా చేశారు. చివరికి రైతుల మీదకి కార్లు కూడా ఎక్కించారని దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం మెడ మీద కత్తిపెట్టి కరెంట్ సంస్కరణ పేరుతో మీటర్లు పెట్టించిందని సీఎం ఆరోపించారు. మోడీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే డబ్బులిస్తాం లేకుంటే ఇవ్వబోమంటోందని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని తరిమి తరిమి కొట్టాలని సీఎం పిలుపునిచ్చారు. 

మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు దేశాన్ని నాశనం చేసిందని.. బీజేపీ ప్రభుత్వం ఏ రంగానికి న్యాయం చేయలేదని కేసీఆర్ మండిపడ్డారు. సంగతి చూస్తాం అంటున్నారని.. ఏం చూస్తారంటూ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంగతి చూస్తాం అంటున్నారని.. ఏం చూస్తారంటూ కేసీఆర్ సంగతి మండిపడ్డారు. తెలంగాణకు ఎందుకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని.. మతతత్వ బీజేపీ వుంటే, పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా వస్తారా అని ప్రశ్నించారు. నరేంద్రమోడీ సిగ్గుపడాలని.. కర్ణాటకలో ఏం జరుగుతోందో చూస్తున్నాం కదా అని కేసీఆర్ గుర్తుచేశారు. సిలికాన్ వ్యాలీలో ఆడబిడ్డల మీద, విద్యార్ధుల మీద దాడులు జరుగుతున్నాయని సీఎం తెలిపారు. 

విద్యార్ధుల మధ్య బీజేపీ మత కలహం పెడుతోందని .. దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది నిజం కాదా అని కేసీఆర్ ప్రశ్నించారు. మోడీ ఉజ్వలమైన పరిపాలనలో పరిశ్రమలు మూతపడటం నిజం కాదా .. బీజేపీ ఏ రంగానికి మేలు చేసిందని సీఎం నిలదీశారు. ఈ దేశం ఎవరి అయ్య సొత్తు కాదని.. దేశంలో సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోవడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ దుయ్యబట్టారు. మోడీ చేతకానితనం, తెలివి తక్కువతనంతో నీటి వనరులు సద్వినియోగం కావడం లేదని.. ఆకలిలో భారత్ స్థానం 101 అని సీఎం గుర్తుచేశారు. 

మరి మోడీ ప్రభుత్వం ఏం చేస్తున్నారని.. మోడీ గొప్ప పాలనలో పవిత్ర గంగానదిలో శవాలు తేలతయ్యా అని కేసీఆర్ ప్రశ్నించారు. కరోనా సమయంలో కోట్ల మంది వేల కిలోమీటర్లు రోడ్డుపై నడిచారని... మోడీ ఎందుకు తెలంగాణలో తల గోక్కుకుంటున్నారని సీఎం స్పష్టం చేశారు. మోడీ మనసులో అసలేముంది.. కేసీఆర్ నీటి చుక్క అయితే ఎందుకు గడగడ వణుకుతున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ తన ప్రాణమని.. తాను చచ్చినా సరే కేంద్రం కరెంట్ పాలసీలు తెలంగాణలో అమలు చేసేది లేదని ఆయన తేల్చిచెప్పారు. 

కేంద్రంలో అవినీతి బాగోతాలు ఈ మధ్యనే తన దగ్గరికి చేరాయంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాక్రే, స్టాలిన్ తనతో మాట్లాడారని.. అస్సాంలో బీజేపీ సీఎం రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీజీ ఇదేనా నీ సంస్కారం.. ఇదే నీ భాష అంటూ సీఎం దుయ్యబట్టారు.