హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మందుల కొనుగోలు స్కాంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఈఎస్ఐ స్కాంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. స్కాంలో ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

ఈఎస్ఐ కు సంబంధించి నూతన సంచాలకులు, సంయుక్త సంచాలకులను నియమించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేసు విచారణకు సబంధించి వివరాలు ఎప్పటికప్పడు తెలియజేస్తూ ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

ఇకపోతే రోగులకు పంపిణీ చేయాల్సిన మందుల కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడినట్లు ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ వసంత ఇందిరలతోపాటు మరో 14 మంది నివాసాల్లో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

ఏసీబీ సోదాలు అనంతరం డైరెక్టర్ దేవికారాణితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షల అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఈఎస్ఐ కుంభకోణం: శశాంక్ గోయల్‌‌ మెడకు చుట్టుకున్న స్కాం...

వైద్య పరీక్షల కోసం దేవికా రాణితో పాటు ఏడుగురు ఉస్మానియాకు తరలింపు...

 ఈఎస్ఐ మందుల స్కాం... దేవికా రాణి అరెస్ట్...