మత ఘర్షణల తెలంగాణ కావాలా.. ప్రశాంత తెలంగాణ కావాలా:భైంసా సభలో విపక్షాలపై కేసీఆర్ ఫైర్

ఎన్నికల సమయంలో  విపక్షాలపై  తెలంగాణ సీఎం తన విమర్శలకు మరింత పదను పెట్టారు.  రాష్ట్రంలో తమ పాలనలో అభివృద్దితో పాటు  విపక్షాలు  ఏ రకంగా  వ్యవహరిస్తున్నాయనే విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. 
 

Telangana CM KCR Serious Comments on  BJP And Congress lns

భైంసా:మత ఘర్షణలు జరిగే తెలంగాణ కావాలా.. ప్రశాంత తెలంగాణ కావాలో తేల్చుకోవాలని  తెలంగాణ సీఎం కేసీఆర్  ప్రజలను కోరారు.శుక్రవారంనాడు  భైంసాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో  కేసీఆర్ ప్రసంగించారు.   పదేళ్లుగా  తమ పాలనలో  తెలంగాణ ప్రశాంతంగా ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో  ఎప్పుడూ మత ఘర్షణలు జరిగేవని ఆయన గుర్తు చేశారు.

 మత ఘర్షణలను  ఓ పార్టీ మతం పేరు చెప్పి ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని  కేసీఆర్ పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు. ప్రతిపక్షాల మాయలో  పడొద్దని  తెలంగాణ సీఎం  కేసీఆర్ ప్రజలను కోరారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా తన మాటను నమ్మాలని కేసీఆర్ కోరారు.  గత ప్రభుత్వాలు తెలంగాణను పట్టించుకోలేదన్నారు.  తమ ప్రభుత్వం చేసిన అభివృద్ది కంటికి కన్పిస్తుందన్నారు.  సరైన పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ది సాధ్యమని కేసీఆర్ చెప్పారు. ప్రతిపక్షాలు ఇష్టానుసారం అబద్దాలు, గాలిమాటలు చెబుతున్నాయని  కేసీఆర్  ఆరోపించారు. పార్టీల చరిత్ర, వాళ్ల థృక్పథంం చూసి వివేకంతో ఓటు వేయాలని కేసీఆర్  కోరారు.

also read:50 ఏళ్లు ఏం చేశారు, ఒక్క అవకాశమంటున్నారు: ఆర్మూర్ సభలో కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్

ఎన్నికలు రాగానే ఎవరెవరో వస్తారు.. ఏదేదో చెప్పారన్నారు.  ఎవరో వచ్చి చెప్పిన అబద్దాలను నమ్మి గుడ్డిగా ఓటు వేయవద్దని  కేసీఆర్ ప్రజలను కోరారు.పోటీ చేస్తున్న వ్యక్తి, అభ్యర్ధి వెనుక ఉన్న పార్టీ దాని చరిత్రను చూడాలన్నారు.

రైతుబంధు దుబారా అంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆయన  విమర్శించారు. ధరణి పోర్టల్ ను తీసేస్తామని కాంగ్రెస్ నేతలు  చెబుతున్నారన్నారు. రాహుల్ సహా కాంగ్రెస్ నేతలంతా ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామని చెబుతున్నారన్న విషయాన్ని  కేసీఆర్ గుర్తు చేశారు. ధరణిని తీసేస్తే  రైతుబంధు, రైతు భీమా ఎలా వస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు.ధరణిని తీసేస్తే మళ్లీ భూ సమస్యలు,లంచాల సమస్య మొదలయ్యే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారు. 

పదేళ్లలో  తెలంగాణకు  ఒక్క మెడికల్  కాలేజీ ఇవ్వని  బీజేపీకి  ఒక్క ఓటు కూడ ఎందుకు వేయాలని ఆయన  ప్రశ్నించారు.  కొత్త జిల్లాల్లో  నవోదయ స్కూల్స్ ఏర్పాటు చేయాలని చట్టం చెబుతున్నా కూడ కేంద్రం పట్టించుకోలేదన్నారు.  చట్టాలను కేంద్ర సర్కార్ అమలు చేయడం లేదని  కేసీఆర్ మోడీ సర్కార్ పై విమర్శలు చేశారు.వ్యవసాయ మోటార్లకు  మీటర్లు పెట్టాలని  మోడీ సర్కార్ తమపై ఒత్తిడి తెచ్చిందన్నారు.  అయినా  కూడ తన తలతెగిపడినా  వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టలేదన్నారు.  ప్రతి ఏటా తెలంగాణకు  రూ. 5 వేల కోట్లను కేంద్రంలోని మోడీ సర్కార్ నిలిపివేసిందని ఆయన గుర్తు చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios