నేను ఉన్నంత వరకు తెలంగాణ సెక్యులర్ స్టేట్ గానే : కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణ సెక్యులర్‌గా వుంటుందని ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లుగా రాష్ట్రాన్ని శాంతియుతంగా పాలిస్తున్నామని.. తెలంగాణ హక్కుల కోసమే బీఆర్ఎస్ పుట్టిందని కేసీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణ సెక్యులర్‌గా వుంటుందని ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నిర్మల్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిస్తూ.. తెలంగాణలో ఇవాళ 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతోందని సీఎం వెల్లడించారు. ధాన్యం దిగుబడిలో త్వరలోనే పంజాబ్‌ను కూడా తెలంగాణ అధిగమించబోతోందని కేసీఆర్ పేర్కొన్నారు. ఓటు వేసేటప్పుడు ప్రజలకు ఏ పార్టీ ఏం చేసిందో చూడాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.
నిర్మల్‌కు మెడికల్ కాలేజ్ వస్తుందని ఎన్నడైనా ఊహించమా అన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ పార్టీ దళితులను ఓటు బ్యాంక్ కోసమే వాడుకుందన్నారు. ఎన్నికల్లో వ్యక్తులు, కార్యదక్షతను కూడా చూడాలని కేసీఆర్ తెలిపారు. గిరిజనులు వ్యవసాయం చేసుకునేందుకు వసతులు కల్పించామని సీఎం వెల్లడించారు. రైతుబంధుపై కాంగ్రెస్ రకరకాలుగా మాట్లాడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులకు పోడు భూములపై పట్టాలు ఇచ్చామన్నారు.
ఇంద్రకరణ్ రెడ్డి మెజారిటీ 80 వేలు దాటాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పదేళ్లుగా రాష్ట్రాన్ని శాంతియుతంగా పాలిస్తున్నామని.. తెలంగాణ హక్కుల కోసమే బీఆర్ఎస్ పుట్టిందని కేసీఆర్ పేర్కొన్నారు. 15 ఏళ్లు నిర్విరామంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నామని.. పదేళ్ల పాటు బీఆర్ఎస్‌ను ఆశీర్వదించారని సీఎం అన్నారు. తెలంగాణ రాకుంటే నిర్మల్ జిల్లా అయ్యేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. నిర్మల్‌కు జిల్లా కావాలని ఇంద్రకరణ్ రెడ్డి తపనపడ్డారని సీఎం తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా దళితబంధు స్కీమ్ తెచ్చామని.. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.
ఈసీ అనుమతిస్తే ఇప్పుడే రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి అంటున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. ధరణి తీసేస్తే.. రైతుబంధు, రైతుబీమా కూడా పోతాయని సీఎం హెచ్చరించారు. నష్టం వచ్చినా రైతుల వద్ద పంట కొంటున్నామని కేసీఆర్ తెలిపారు. ధరణి తీసేస్తే.. మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని సీఎం వెల్లడించారు. గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చామని కేసీఆర్ స్పష్టం చేశారు. అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ గెలవాలని సీఎం పేర్కొన్నారు.