సూట్‌కేసులు పట్టుకొని వచ్చేవాళ్లకు బుద్ది చెప్పాలి: మందమర్రి సభలో వివేక్ వెంకటస్వామి పై కేసీఆర్

 బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో  తెలంగాణ సీఎం కేసీఆర్  విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. విపక్షాలపై  ప్రచార సభల్లో  కేసీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Telangana CM KCR Satirical Comments on Vivek Venkat Swamy  in Mandamarri Sabha lns

మందమర్రి: తెలంగాణ ప్రజలే  బీఆర్ఎస్ కు బాసులని  తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.  టిక్కెట్లు ఇచ్చుకొనే అధికారం కూడ  ఇక్కడి కాంగ్రెస్ నేతలకు  లేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మందమర్రిలో మంగళవారంనాడు  నిర్వహించిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో  తెలంగాణ సీఎం ప్రసంగించారు.కాంగ్రెస్ అభ్యర్ధి ముసుగు మార్చుకొని  పార్టీ మారారని పరోక్షంగా వివేక్ వెంకటస్వామిపై విమర్శలు చేశారు.

  బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సాధన కోసమన్నారు.  బీఆర్ఎస్ కు ఢిల్లీలో బాస్ లు ఎవరూ లేరదన్నారు.  ఇక్కడి కాంగ్రెస్ నేతలకు  టిక్కెట్లు ఇచ్చే అధికారం కూడ లేదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో టిక్కెట్ల పంచాయితీల గురించి కేసీఆర్ ప్రస్తావించారు. 

కాంగ్రెస్ ఏం చేసిందో, బీఆర్ఎస్ ఏం చేసిందో మీకు తెలుసునన్నారు. ఢిల్లీ బాసులు చెప్పినట్టుగా  ఇక్కడి కాంగ్రెస్ నేతలు  వినాల్సిందేనన్నారు. బీఆర్ఎస్ కు ఢిల్లీ బాసులు ఎవరూ లేరన్నారు. తెలంగాణ ప్రజలే  బీఆర్ఎస్ కు బాసులని ఆయన  చెప్పారు.

ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని ఆయన కోరారు.ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమన్నారు.డబ్బుకు ఓటును అమ్ముకోవద్దన్నారు.ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణితి ఇంకా రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.మనం వేసే ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని కేసీఆర్ తెలిపారు.తెలంగాణకు ఎవరు అన్యాయం చేశారో  ఆలోచించాలన్నారు. ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెసేనని ఆయన  ఆరోపించారు.తెలంగాణ రాకముందు వరకు  భయంకర పరిస్థితులు ఉండేవన్నారు.

సింగరేణిలో  49 శాతం కేంద్రానికి  వాటా ఇచ్చిన దద్దమ్మలు కాంగ్రెస్ సర్కారేనని  ఆయన విమర్శించారు.సింగరేణిని నడపలేక  కేంద్రానికి వాటా ఇచ్చారన్నారు.  10 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు తెలంగాణలో ఉన్నాయని  కేసీఆర్ గుర్తు చేశారు.తెలంగాణ వచ్చాక సింగరేణిని లాభాల బాటల్లోకి తీసుకు వచ్చినట్టుగా కేసీఆర్  వివరించారు.ప్రస్తుతం సింగరేణికి రూ. 2,184 కోట్ల లాభాలు వచ్చాయని కేసీఆర్ తెలిపారు.

సింగరేణిని ప్రైవేటీకరించాలని కేంద్రం ప్రయత్నిస్తుందని  ఆయన ఆరోపించారు. అయితే ప్రైవేటీకరించవద్దని  తమ పార్టీ ప్రజా ప్రతినిధులు  ఆందోళనలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

also read:వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరినా పట్టించుకోలేదు: గద్వాల సభలో మోడీ పై కేసీఆర్ ఫైర్

వ్యవసాయానికి  24 గంటల పాటు ఉచిత విద్యుత్ , ధరణి వద్దని కాంగ్రెస్ నేతలు  ప్రచారం చేస్తున్నారన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్  కావాలా,వద్దో చెప్పాలన్నారు.  ధరణి ఉండాలా , ఎత్తివేయాలా అని  ప్రజలను కోరారు. ధరణి వద్దన్నవారికి డిపాజిట్ కూడ రావదన్నారు.రైతుల గురించి ఏనాడు కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు.

 

ఎన్నికల సమయంలో  సూట్ కేసులు పట్టుకొని వచ్చే నాయకులు కావాలా..  జేబులో పైసలు లేని  సుమన్ లాంటి నేతలు  కావాలా ఆలోచించాలని  ఆయన  ప్రజలను కోరారు. తెలంగాణ ఉద్యమంలో  జైళ్లకు వెళ్లి ప్రజలు ఆశీర్వదిస్తే  ఎంపీగా, ఎమ్మెల్యేగా  సుమన్  విజయం సాధించారన్నారు.సమైఖ్య పాలనలో  దశాబ్దాల పాటు  ఇబ్బందులు పడిన విషయాన్ని  కేసీఆర్ గుర్తు చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios