గుండు జాడలేదు...ప్రవచనకారుడిలా సెల్ఫ్ సర్టిఫికెట్: బండి, భట్టిలపై కేసీఆర్ సెటైర్లు

బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్,  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కపై  తెలంగాణ సీఎం కేసీఆర్  ఇవాళ సెటైర్లు వేశారు.
 

Telangana CM KCR  Satirical Comments on Bandi Sanjay and  Mallubhatti Vikramarka lns

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ , సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కలపై  తెలంగాణ సీఎం కేసీఆర్  సెటైర్లు  వేశారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన స్వల్పకాలిక చర్చపై  సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వరదల వల్ల నష్టపోయిన వారిని కాపాడుకుంటామని  తెలంగాణ సీఎం కేసీఆర్  చెప్పారు.

వరదల్లో బండి  పోతే బండి, గుండుపోతే గుండు ఇస్తామన్న అన్న వ్యక్తి జాడ లేకుండా  పోయాడని తెలంగాణ సీఎం కేసీఆర్ బండి సంజయ్ పై సెటైర్లు వేశారు.వరదల వల్ల నష్టపోయిన వారిని కాపాడుకుంటామన్నారు. గతంలో  హైద్రాబాద్ లో  తీవ్ర నష్టం జరిగితే  కేంద్రం ఒక్క రూపాయి కూడ ఇవ్వలేదన్నారు.అప్పట్లో  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  చేసిన వ్యాఖ్యలపై  తెలంగాణ సీఎం కేసీఆర్  పరోక్ష విమర్శలు చేశారు. 

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  తన ప్రసంగంలో  తన పాదయాత్ర గురించి ప్రస్తావించారు. ఈ విషయమై  కేసీఆర్  సెటైర్లు వేశారు. 
ఓ ప్రవచనకారుడి తరహాలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తనకు తాను  సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకున్నారన్నారని ఆయన ఎద్దేవా చేశారు.పాదయాత్రలో నాయకులకు ప్రజలు సమస్యలు చెప్పుకోవడం సహజమన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు  నిర్మిస్తుంటే  420  కేసులు వేశారన్నారు. ధాన్యం దిగుమతిలో పంజాబ్  తెలంగాణను అధిగమిస్తుందన్నారు.తొలినాళ్లలోనే  30-40 లక్షల టన్నుల సామర్ధ్యం గల గోదాములను  నిర్మించినట్టుగా  కేసీఆర్ గుర్తు  చేశారు.మిల్లులకు తరలించేందుకు రాష్ట్రంలో లారీలు సరిపోవడం లేదన్నారు. పండిన ధాన్యాన్ని  రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు  చేశారు.ఏడు వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం  కొంటున్నట్టుగా  కేసీఆర్ తెలిపారు.వ్యవసాయ మోటార్లకు  మీటర్లు పెట్టకపోతే  కేంద్రం ఎఫ్ఆర్‌బీఎం పరిధిలో కోత విధించిందన్నారు.కేంద్రం ఆంక్షల వల్ల  రాష్ట్రం రూ. 5 వేల కోట్లు కోల్పోతున్నట్టుగా  కేసీఆర్ వివరించారు. నెల రోజుల్లో రైతులకు  రుణమాఫీని కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు.

also read:వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే: తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్

ధరణి పోర్టల్ కారణంగానే  10 నిమిషాల్లోనే భూమి రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని కేసీఆర్ చెప్పారు.ధరణి వల్లే రిజిస్ట్రేషన్ కోసం లంచాలు ఇవ్వాల్సిన  పరిస్థితి లేదన్నారు.ధరణి వల్లే ఒక్క రోజే లక్షల మందికి రైతు బంధు అమలౌతుందన్నారు.రైతు మరణిస్తే  ఆ కుటుంబానికి వారం రోజుల్లోనే  రూ. 5 లక్షల పరిహారం అందిస్తున్నామని  కేసీఆర్ వివరించారు.గురుకులాల్లో ఒక్కో  విద్యార్ధిపై  రూ. 1.25 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ హయంలో  443 జూనియర్ కాలేజీలుంటే ఇప్పుడు 1372కు చేరుకున్నాయన్నారు.విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు రూ. 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్ అందిస్తున్నట్టుగా  కేసీఆర్ వివరించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios