జూలై 1 నుంచి పల్లె ప్ర‌గ‌తి.. ప్ర‌తి ఇంటికి 6 మొక్క‌లు: అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం

తెలంగాణ‌లో జూలై 1వ తేదీ నుంచి చేప‌ట్టనున్న ప‌ల్లె ప్ర‌గ‌తి, హ‌రిత‌హారం కార్యక్రమాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జులై 1 నుంచి పల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాలు ప్రారంభించాల‌ని ఆదేశించారు. నిర్దేశించిన ఏ ప‌నీ పెండింగ్‌లో ఉండేందుకు వీల్లేద‌ని ఆయన సూచించారు

telangana cm kcr review meeting on palle pragathi and haritha haram ksp

తెలంగాణ‌లో జూలై 1వ తేదీ నుంచి చేప‌ట్టనున్న ప‌ల్లె ప్ర‌గ‌తి, హ‌రిత‌హారం కార్యక్రమాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జులై 1 నుంచి పల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాలు ప్రారంభించాల‌ని ఆదేశించారు. నిర్దేశించిన ఏ ప‌నీ పెండింగ్‌లో ఉండేందుకు వీల్లేద‌ని ఆయన సూచించారు. పంచాయ‌తీరాజ్ శాఖ‌కు ప్ర‌భుత్వం బాగా స‌హ‌క‌రిస్తోందని.. ప‌నులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో స‌మీక్ష చేసుకోవాల‌ని కేసీఆర్ ఆదేశించారు. గ్రామాల్లో ప్ర‌తి ఇంటికి 6 మొక్క‌లు ఇచ్చి నాటించాలని ఆయన సూచించారు.

ఎన్న‌డూ లేని విధంగా పంట‌ల‌తో రాష్ర్టం ధాన్యాగారంగా మారిందని.. ఈ క్ర‌మంలో రాష్ట్రానికి అద‌న‌పు రైస్ మిల్లులు అవ‌స‌రం ఉంద‌ని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రైస్ మిల్లుల సంఖ్య‌ను పెంచి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సీఎం ఆదేశించారు. 250 ఎక‌రాల్లో ఒక్కో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ ఏర్పాటు చేయాల‌ని సూచించారు. సెజ్‌ల చుట్టూ బ‌ఫ‌ర్ జోన్లు ఏర్పాటు చేయాల‌ని.. వీటి ప‌రిధిలో లే ఔట్లు, నిర్మాణాల‌కు అనుమ‌తులు ఇవ్వొద్ద‌ని కేసీఆర్ ఆదేశించారు.

Also Read:పాఠశాలల ప్రారంభం, ఆన్‌లైన్ క్లాసులు ఆ రెండు తరగతులకే: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

క‌ల్తీ విత్త‌నాల అమ్మ‌కాల ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. వ్య‌వ‌సాయ శాఖ‌, పోలీసులు క‌ల్తీ విత్త‌నాల‌ను అరిక‌ట్టాల‌ని ఆయన ఆదేశించారు. క‌లెక్ట‌ర్లు, జిల్లాల ఉన్న‌తాధికారులు తమకున్న విశేష అధికారాలు వాడాల‌న్నారు. గ్రామాల్లో విద్యుత్ స‌మ‌స్య ప‌రిష్కారానికి ప‌వ‌ర్ డేను పాటించాలని కేసీఆర్ సూచించారు. ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌రిచి శ్ర‌మ‌దానంలో పాల్గొనేలా చేయాల‌ని సీఎం కోరారు. 

ఈ స‌మీక్షా స‌మావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), 2019 బ్యాచ్ ఐఏఎస్ లు, డీఎఫ్ఓలు, కన్జర్వేటర్లు, డీపీవోలు, డీఆర్ డీవోలు, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖల అధికారులు హాజ‌ర‌య్యారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios