అనుకున్న సమయంలోనే మేడిగడ్డ ద్వారా కాళేశ్వరానికి నీటిని తరలిస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేసినందుకు ఇంజనీరింగ్ విభాగాన్ని అభినందించారు సీఎం.

కాళేశ్వరం ప్రాజెక్ట్ టూర్‌లో భాగంగా ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను సందర్శించారు కేసీఆర్. కాళేశ్వరం నీటితో రాష్ట్రంలో చెరువులు, రిజర్వాయర్లు నింపుతామన్నారు.

ప్రాజెక్ట్‌ల వారీగా ఆపరేషన్ రూల్స్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే స్పూర్తితో ఇతర ప్రాజెక్ట్‌ల పనులను వేగంగా పూర్తి చేయాలని కేసీఆర్ సూచించారు.

అంతకుముందు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి సతీసమేతంగా కాళేశ్వరం బయలుదేరి వెళ్లారు ముఖ్యమంత్రి. అనంతరం సతీసమేతంగా కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో కేసీఆర్ పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులతో రివ్యూ నిర్వహించారు.