Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ఐదు జిల్లాలకు భారీ వర్ష సూచన: అప్రమత్తమైన కేసీఆర్

భారీ వర్ష సూచనపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఐదు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది.

telangana cm kcr review meeting on heavy rains
Author
Hyderabad, First Published Sep 20, 2020, 7:20 PM IST

భారీ వర్ష సూచనపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఐదు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది.

దీంతో అప్రమత్తమైన కేసీఆర్ అధికారులను అలర్ట్ చేయాల‌ని సీఎస్‌ను ఆదేశించారు. అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. ఈ క్ర‌మంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు, పోలీసు ఉన్న‌తాధికారుల‌తో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ రెండు, మూడు రోజులు హెడ్ క్వార్ట‌ర్స్‌లోనే ఉండాల‌ని సీఎస్ అధికారుల‌ను ఆదేశించారు.

తెలంగాణ‌లో గ‌త కొద్ది రోజుల నుంచి విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌కు రాష్ర్టంలోని ప్రాజెక్టులు నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. వాగులు, వంక‌లు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. 
 
Follow Us:
Download App:
  • android
  • ios