జూన్ 15 నుంచి 25 వరకు రైతు బంధు సాయం అందజేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో శనివారం వ్యవసాయరంగం, విత్తనాల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం, రైతుబంధు పంపిణీ, ధాన్యం సేకరణ మీద సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రైతుల ఖాతాల్లో ఆర్ధిక శాఖ ఆ మొత్తాన్ని జమ చేస్తుందని ఆయన తెలిపారు.

కల్తీ విత్తనదారులను ప్రభుత్వం క్షమించదని.. బయో పెస్టిసైడ్ పేరుతో మోసం చేస్తే పీడీ యాక్ట్ పెడతామని కేసీఆర్ హెచ్చరించారు. వ్యవసాయ అధికారులను సైతం డిస్మిస్ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. విత్తనాలను కల్తీ చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తామని.. క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేయాలని సీఎం తెలిపారు. కోటి ఎగరాల మాగాణి చేయడంలో సక్సెస్ అయ్యామని కేసీఆర్ గుర్తుచేశారు.

Also Read:కరోనా వేళ జూనియర్ డాక్టర్ల సమ్మె: తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్

కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నా.. కాళేశ్వరాన్ని పూర్తి చేశామని సీఎం తెలిపారు. విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో వుంచాలని కేసీఆర్ స్పష్టం చేశారు. విత్తనాలు ఫెస్టిసైడుల్లో కల్తీని అరికట్టడానికి కఠిన నిబంధనలను అమలు చేస్తూ, అవసరమైన చట్ట సవరణ చేయాలని, అందుకు సంబంధించి అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు.