తెలంగాణ సీఎం కేసీఆర్  సమీప బంధువు గునిగంటి కమలాకర్ రావు శనివారం నాడు అనారోగ్యంతో మరణించాడు. కామారెడ్డి పట్టణంలోని తన స్వగృహంలో చనిపోయాడు

కామారెడ్డి: తెలంగాణ సీఎం కేసీఆర్ మేనమామ వరుసయ్యే గునిగంటి Kamalakara Rao శనివారం నాడు మరణించాడు. Kamareddy పట్టణంలోని దేవి విహార్ లోని తన స్వంత ఇంటిలలో కమలాకర్ రావు మరణించారు. కొంత కాలంగా కమలాకర్ రావు అనారోగ్యంతో ఉన్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. రాజంపేట మండలం అర్లోండ గ్రామానికి చెందిన కమలాకర్ రావు కామారెడ్డిలో నివసిస్తున్నాడు. కమలాకర్ రావు పిల్లలు Hyderabad లో నివాసం ఉంటున్నారు. పదేళ్ల క్రితం కమలాకర్ రావు భార్య చనిపోయింది. ఆ సమయంలో KCR కమలాకర్ రావు ఇంటికి వచ్చి ఆయనను పరామర్శించారు.

 బాల్యంలో తరచుగా కేసీఆర్ కామారెడ్డిలోని కమలాకర్ రావు ఇంటికి వెళ్లేవాడు.ఈ విషయమై కేసీఆర్ గతంలో పలుమార్లు ప్రస్తావించారు. కమలాకర్ రావు అంత్యక్రియలు శనివారం నాడు నిర్వహించారు. అయితే అంత్యక్రియలకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా హాజరు కాలేదు.