Asianet News TeluguAsianet News Telugu

మెదక్: కేసీఆర్ కాన్వాయ్ ఆపిన కాశీరెడ్డిపల్లె గ్రామస్తులు, త్వరలోనే భోజనానికి వస్తానన్న సీఎం

వాసాలమర్రి పర్యటనను ముగించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మరో గ్రామ సందర్శనకు సిద్ధమయ్యారు. మెదక్ జిల్లా కాశీరెడ్డిపల్లె గ్రామానికి వారం పది రోజుల్లో వచ్చి భోజనం చేసి వెళతానని సీఎం హామీ ఇచ్చారు. 

telangana cm kcr ready to visit Kasireddypally Village in medak district ksp
Author
Hyderabad, First Published Aug 4, 2021, 9:39 PM IST

మరో గ్రామ పర్యటనకు సిద్ధమయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. దత్తత గ్రామం వాసాలమర్రి పర్యటనను ముగించుకుని తిరిగి ఎర్రవల్లికి వెళ్తుండగా మెదక్ జిల్లా కాశిరెడ్డిపల్లె గ్రామం వద్ద తన కాన్వాయ్‌ని ఆపారు సీఎం. ఆ గ్రామస్తులో మాట్లాడారు. గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై చర్చించారు. కాశీరెడ్డిపల్లె గ్రామ సర్పంచ్ .. అభివృద్దికి సహాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. వారం పది రోజుల్లో గ్రామానికి వస్తానని, భోజనం చేసి వెళ్తానని హామీ ఇచ్చారు తెలంగాణ  సీఎం కేసీఆర్. 

అంతకుముందు యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజిబిజీగా గడిపారు. కాలినడకన గ్రామమంతా కలియతిరిగిన సీఎం.. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. వాసాలమర్రిలో వున్న బీసీలను ఆదుకుంటామని.. గ్రామంలో కబ్జాకు గురైన భూముల వివరాలు సేకరించామని సీఎం తెలిపారు. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు భూమి ఇస్తామని.. దళితుల భూకమతాలు ఏకీకరణ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పిన సీఎం.. రేపట్నుంచే మీ ఖాతాల్లో రూ.10 లక్షల డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు. 

Also Read:వాసాలమర్రితోనే దళిత బంధు ప్రారంభం.. హుజురాబాద్‌లో లాంఛనమే: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

దళితులు అణిచివేతకు , వివక్షకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు ఇంకా పేదరికంలోనే వున్నారని.. దళిత సమాజం కోసం బీఆర్ అంబేడ్కర్ ఎంతో పోరాటం చేశారని సీఎం గుర్తుచేశారు. అంబేద్కర్ వల్లే రిజర్వేషన్లు వచ్చాయని.. ప్రభుత్వాలు సరైన విధానాలు పాటించకపోవడం వల్లే ఇప్పటికీ దళితులు పేదరికంలో వున్నారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇటీవలే దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టామని , ఈ పథకాన్ని విఫలం కానివ్వొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. దళితుల్లో ఐకమత్యం రావాలని.. వాసాలమర్రిలో కొత్త ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios