కరోనా రోగులకు ధైర్యం చెప్పిన కేసీఆర్: గాంధీలో వైద్య సిబ్బందిని అభినందించిన సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నాడు గాంధీ ఆసుపత్రిలో పర్యటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకొన్నారు

Telangana CM KCR Reaches to Gandhi Hospital lns

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నాడు గాంధీ ఆసుపత్రిలో పర్యటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకొన్నారు. ఆసుపత్రిలో కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలతో పాటు  ఇతర విషయాలపై ఆయన ఆరా తీశారు. 

Telangana CM KCR Reaches to Gandhi Hospital lns

 

ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి తప్పించిన తర్వాత   వైద్య ఆరోగ్య శాఖను కేసీఆర్ తన వద్దే ఉంచుకొన్నారు. సీఎం హోదాలో కేసీఆర్ తొలిసారిగా గాంధీ ఆసుపత్రిని పరిశీలిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 1500 మంది కరోనా రోగులున్నారు. గాంధీ ఆసుపత్రిలో పరిస్థితులను ఆయన  స్వయంగా తెలుసుకొంటున్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు.  

రోనా రోగుల వెంట తమను ఉండేలా చర్యలు తీసుకొనేలా చూడాలని కొందరు రోగులు సీఎంను కోరారు. అయితే  రోగుల వెంట ఉండేవారికి కూడ కరోనా సోకే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లతో సీఎం కేసీఆర్ చర్చించారు. కరోనా రోగులకు అందుతున్న భోజనం గురించి కూడ ఆయన వాకబు చేశారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని సీఎం వైద్య శాఖాధికారులకు సూచించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం గురించి ఆయన  అడిగి తెలుసుకొన్నారు. ఐసీయూలో చికిత్స తీసుకొంటున్న రోగులకు సీఎం ధైర్యం చెప్పారు.గత టర్మ్‌లో ఉస్మానియా ఆసుపత్రిలో ఆయన పర్యటించారు. ఉస్మానియా ఆసుపత్రిని కూల్చి కొత్త భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios