ఐదు రోజులు ఢిల్లీలోనే:హైద్రాబాద్ కు చేరుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ కు చేరుకున్నారు. కేసీఆర్ ఐదు రోజుల పాటు ఢిల్లీలో ఉంది ఏం చేశారని కూడా విపక్షాలు ప్రశ్నించాయి.
హైదరాబాద్: తెలంగాణ సీఎం KCR ఆదివారం నాడు Hyderabad కు చేరుకున్నారు. New Delhi లో ఐదు రోజుల పాటు కేసీఆర్ గడిపాడు.ఈ నెల 29వ తేదీన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ Akhilesh Yadav ఢిల్లీలో కేసీఆర్ ను కలిశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన సమయంలో కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు.ఈ విషయమై కేసీఆర్ పై విపక్షాలు విమర్శలు చేశారు.
బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ , సీఎస్ సోమేష్ కుమార్ పలువురు ప్రజా ప్రతినిధులు ఈ నెల 25న న్యూఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగింది. మరో వైపు కేంద్ర మంత్రులను కూడా సీఎం కేసీఆర్ కూడా కలిసే అవకాశం ఉందని ప్రచారం కూడా సాగింది. కానీ సీఎం కేసీఆర్ ఎవరిని కూడా కలవకుండా ఏం చేశారని శనివారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఢిల్లీలో ఉండి ఏం చేశారని ఆయన అడిగారు.
సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉన్న సమయంలో భారీగా కురిసిన వర్షాల కారణంగా మూసీకి వరద పోటెత్తింది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. పురానాపుల్ వద్ద ఉన్న బ్రిడ్జి, చాదర్ ఘాట్ అండర్ బ్రిడ్జి, మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద రాకపోకలు నిలిపివేశారు. మూసీకి వరద తగ్గిన తర్వాత ఈ మూడు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను పునరుద్దరించారు.
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబబందులు పడుతున్న సమయంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ఏం చేశారని కూడా విపక్ష నేతలు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రానికి వరదల వల్ల కలిగిన నష్టానికి నిధులు మంజూరు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రానికి వరదల వల్ల కలిగిన నష్టం విషయమై పార్లమెంట్ లో కూడా తాము పోరాటం చేశామని రేవంత్ రెడ్డి గర్తు చేశారు. ఈ విషయమై పార్లమెంట్ లో వాయిదా తీర్మానం కూడా ఇచ్చామని ఆయన మీడియా సమావేశంలో ఇటీవల ప్రకటించారు. వరదల కారణంగా తెలంగాణకు కేంద్రం నుండి నిధులు ప్రకటించకపోతే ఢిల్లీ వేదికగానే కేసీఆర్ కేంద్రంపై పోరాటానికి సంబంధించి కార్యాచరణను ప్రకటించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
also read:ఆ రెండు చోట్ల ఎక్కడ పోటీ చేసినా పర్లేదు.. కేసీఆర్‌కు ఈటల రాజేందర్ సవాలు
విపక్ష పార్టీలకు చెందిన నేతలను కూడా కేసీఆర్ కలవాలని భావించారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగింది. కానీ సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మినహా కేసీఆర్ ఎవరితో భేటీ కాలేదు. అయితే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ విపక్షాలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొంటున్నారు.