Asianet News TeluguAsianet News Telugu

ఆ రెండు చోట్ల ఎక్కడ పోటీ చేసినా పర్లేదు.. కేసీఆర్‌కు ఈటల రాజేందర్ సవాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  హుజురాబాద్, గజ్వేల్‌లల్లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా పర్లేదు అని సవాలు విసిరారు. 

BJP mla etela rajender Open challenge to CM KCR
Author
First Published Jul 30, 2022, 4:33 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత కొంతకాలంగా గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని ఈటల రాజేందర్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కేసీఆర్ టార్గెట్‌గా ఈటల ఫైర్ అయ్యారు. హుజురాబాద్, గజ్వేల్‌లల్లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా పర్లేదు అని సవాలు విసిరారు.  సీఎం కేసీఆర్‌ను ఓడగొట్టడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆప్షన్ కేసీఆర్‌కే వదిలేస్తున్నాని అన్నారు. 

ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ లాంటివారే ఓడిపోయారని.. అధికారం ఉందని విర్రవీగద్దని కేసీఆర్‌పై మండిపడ్డారు. బ్రహ్మదేవుడు కూడా టీఆర్ఎస్ పార్టీని కాపాడలేడని అన్నారు. టీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌ కంటే తనకే ఎక్కువ వ్యక్తిగత పరిచయాలున్నాయని అన్నారు. కేసీఆర్‌‌పై టీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయారని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీలోకి అన్ని పార్టీల నుంచి భారీగా చేరికలు ఉంటాయని అన్నారు. బీజేపీ తెలంగాణ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios