Asianet News TeluguAsianet News Telugu

కొడుకును అభినందించిన కేసీఆర్.. కారణం ఇదే.. !!

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. కరోనా కష్టకాలంలోనూ ఐటీ ఎగుమతుల్లో వరుసగా ఐదోసారి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాదికి గాను ఐటీ ఎగుమతుల్లో 17.93 శాతం వృద్ధిని సాధించింది. 

telangana cm kcr praises minister ktr over it exports in country
Author
Hyderabad, First Published May 21, 2020, 7:10 PM IST

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. కరోనా కష్టకాలంలోనూ ఐటీ ఎగుమతుల్లో వరుసగా ఐదోసారి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాదికి గాను ఐటీ ఎగుమతుల్లో 17.93 శాతం వృద్ధిని సాధించింది.

ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ వార్షిక నివేదికను గురువారం సీఎం కేసీఆర్‌కు సమర్పించారు. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ ఐటీ ఎగుమతుల వృద్ధి 17.93 శాతం ఉందని తెలిపారు.

అలాగే ఈ ఏడాది జాతీయ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 23.5 శాతంగా ఉందని కేటీఆర్ ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఐటీ రంగంలో అద్భుత ప్రగతి సాధించినందుకు గాను కేటీఆర్‌ను సీఎం అభినందించారు.

కోవిడ్ 19 కష్టకాలంలోనూ ఐటీ పరిశ్రమను సజావుగా నడిపించారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. భవిష్యత్‌లోనూ ఇదే పట్టుదలను ప్రదర్శించాలని కేసీఆర్ సూచించారు. కాగా 2018-19లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.1,09,219 కోట్లు ఉండగా.. 2019-20 నాటికి రూ.1,28,807 కోట్లకు పెరిగింది. ఇక జాతీయ వృద్ధి రేటు 8.9 శాతంగా నమోదైంది. 

Follow Us:
Download App:
  • android
  • ios