పార్లమెంట్ లో పోరుకు సహకరించాలి: బీజేపీయేతర పార్టీలకు కేసీఆర్ ఫోన్

పార్లమెంట్ లో కేంద్రంపై  పోరాటం చేసేందుకు బీజేపీయేతర పార్టీల నేతలకు సీఎం ేకసీఆర్ పోన్ చేశారు. బీజేపీ తీరును పార్లమెంట్ వేదికగా బట్టబయలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ విషయమై జాతీయ నేతలతో ఆయన చర్చించారు. 
 

Telangana CM KCR Phoned To  Akhilesh Yadav And Sharad Pawar

హైదరాబాద్: Parliament లో BJP కి వ్యతిరేకంగా పోరాటం చేయాలని TRS  నిర్ణయించింది.ఈ మేరకు పార్లమెంట్ లో బీజేపీయేతర పార్టీలు కలిసి వచ్చే  పార్టీలను కలుపుకుపోవాలని టీఆర్ఎస్ చీఫ్ KCR  భావిస్తున్నారు. ఈ మేరకు  బీజేపీయేతర పార్టీల నేతలు, పలు రాష్ట్రాల బీజేపీయేతర సీఎంలకు సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు phone చేశారు. 

ఈ నెల 18వ తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు  ప్రారంభం కానున్నాయి.ఈ సమావేశాల్లో బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై పోరాటం చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయమై రేపు జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశా నిర్ధేశం చేయనున్నారు. 

బీజేపీపై జరిపే పోరాటంలో కలిసివచ్చే అన్నిరాష్ట్రాల విపక్ష పార్టీలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.  కేంద్ర ప్రభుత్వం  తీరును పార్లమెంట్ సమావేశాల్లో  ఎండగట్టాలని కెసిఆర్ భావిస్తున్నారు. 

దేశంలో ప్రమాదంలో పడుతున్న ఫెడరల్, సెక్యులర్ ప్రజాస్వామిక విలువలను కాపాడాలని కేసీఆర్ విపక్ష పార్టీలను ఏకతాటిపైకి  తీసుకు రానున్నారు. ఆర్థిక సంక్షోభంలోకి దేశాన్ని నెట్టివేస్తున్న కేంద్ర వైఖరిని తేటతెల్లం చేసేందుకు  కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. 

పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని  కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీతో.,ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో చర్చించారు. బీహార్ ఆర్జెడీ నేత తేజస్వీయాదవ్ తో  ఇప్పటికే కేసీఆర్ చర్చించారు.

also read:రేపు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం: పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

  యుపీ ప్రతిపక్షనేత అఖిలేశ్ యాదవ్,ఎన్సీప చీఫ్  శరద్ పవార్ సహా ఇతర జాతీయ విపక్ష నేతలతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు.  కేంద్రం పై ప్రజాస్వామిక పోరాటంలో భాగంగా  సిఎం కెసిఆర్ ప్రతిపాదనలకు విపక్ష పార్టీలకు చెందిన నేతలు  సానుకూలంగా స్పందించారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios