రేపు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం: పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

టీఆర్ఎస్ పార్లమెంట్ పార్టీ సమావేశం రేపు జరగనుంది.ఈ నెల 18 నుండి జరగనున్న పార్టీ పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

TRS parliamentary party meet on July 16


హైదరాబాద్: TRS పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారంనాడు జరగనుంది. ఈ నెల 18వ తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. Parliamentసమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ MPలకు  టీఆర్ఎస్ చీఫ్ KCR  దిశా నిర్ధేశం చేయనున్నారు.  కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయమై పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిలదీసే అవకాశం ఉంది. గత సమావేశాల్లో కూడా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో ఇదే రకమైన వ్యూహంతో ముందుకు వెళ్లారు.

మరో వైపు  కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు.ఈ నెల 10వ తేదీన సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశం ఏ రకంగా ఇబ్బంది పడుతుందనే విషయాన్ని వివరించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై కూడా  పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ నిలదీసే అవకాశం ఉంది. 

తెలంగాణను  అన్ని రంగాల్లో నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం  అవలంభిస్తుందని టీఆర్ఎస్ చెబుతుంది. ఈ విధానాలను పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగనున్నారు. ఈ విషయమై టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు.

 ఆర్ధికంగా క్రమశిక్షణను పాటిస్తూ అభివృద్ధి లో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించకుండా కేంద్రం ఇబ్బందులు కల్గిస్తుందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రం అప్పులు తీసుకోకుండా కేంద్రం కొత్త కొత్త నిబంధనలు తీసుకురావడంపై కూడా టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.  తెలంగాణ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా  ఉభయ సభల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని ఎంపీలకు సిఎం కెసిఆర్ సూచించనున్నారు.

వ్యవసాయం, సాగునీరు, తదితర వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన  కార్యాచరణతో  ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.  అయితే రాష్ట్రంలో పండించిన వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం అనుసరించిన విధానాలపై గతంలోనే టీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసనలకు దిగింది. 

 ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా, రైతులను మిల్లర్లను ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ం ఇబ్బంది పెడుతుందని టీఆర్ఎస్ సర్కార్ అభిప్రాయంతో ఉంది. ఈ విషయమైపోరాడాలని పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేయనున్నారు.గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్న తెలంగాణ విషయంలో కేంద్రం పొంతనలేని ద్వంద్వం వైఖరిని దుర్మార్గ విధానాన్ని నిలదీయాలని సిఎం నిర్ణయించారు.  

రాష్ట్రంలో జరుగుతున్న సోషల్ ఆడిట్ గురించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రశంసించడంతో పాటు  అవార్డులు ఇచ్చిన విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. కానీ, నేడు కేంద్ర ప్రభుత్వం  మాట మార్చిందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. 

 తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నగ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేయాలనే కేంద్రం కుట్రపూరిత ధోరణుల పట్ల పార్లమెంటు వేదికగా నిలదీయాలని ఎంపీలకు సిఎం సూచించనున్నారు. 

ఇతర రంగాల్లోనే కాంకుడా ఆర్థిక రంగంలో కూడా  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల, రోజు రోజుకూ దేశ ఆర్థిక వ్యవస్థ పతనమౌతున్నదని ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారన్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.   క్షీణిస్తున్న రూపాయి విలువే అందుకు నిదర్శనంగా దేశ ప్రజలు భావిస్తున్నారన్నారు. రూపాయి పతనం పై కేంద్రాన్ని ఉభయ సభల సాక్షిగా నిలదీయాలని సిఎం కెసిఆర్ ఎంపీలకు సూచించనున్నారు.

పాలనలోనే కాకుండా రాజకీయ, సామాజిక తదితర అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక ఆధిపత్యధోరణి వల్ల దేశంలో రోజు రోజుకూ ప్రజాస్వామిక విలువలు దిగజారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని గులాబీ నేతలు భావిస్తున్నారు.  దేశంలో అశాంతి ప్రబలే సూచనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయన్నారు.

 రాజ్యాంగం పొందుపరిచిన ఫెడరల్ స్పూర్తికి, సెక్యులర్ జీవన విధానానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ పార్లమెంటు వేదికగా  దేశ ప్రజల ఆకాంక్షలను చాటేలా గొంతు విప్పాలని, టిఆర్ఎస్ ఎంపీలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటంలో భాగంగా కలిసివచ్చే ఇతర రాష్ట్రాల విపక్ష ఎంపీలను కూడా కలుపుకుపోనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios