Asianet News TeluguAsianet News Telugu

న్యూఢిల్లీలో టీఆర్ఎస్ భవన నిర్మాణం: భూమిపూజ చేసిన కేసీఆర్

న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో గల  స్థలంలో టీఆర్ఎస్ భవన నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ గురువారం నాడు భూమి పూజ నిర్వహించారు.  టీఆర్ఎస్ కు కేంద్ర ప్రభుత్వం 1300 గజాల స్థలాన్ని కేటాయించింది. టీఆర్ఎస్ నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 

Telangana CM KCR performs Boomi puja for new TRS  Building in New delhi
Author
Hyderabad, First Published Sep 2, 2021, 1:37 PM IST


న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో టీఆర్ఎస్ నూతన భవన నిర్మాణానికి గురువారం నాడు భూమి పూజ నిర్వహించారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు, ఆ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.ఢిల్లీలో టీఆర్ఎస్‌ పార్టీకి కేంద్ర ప్రభుత్వం 1300 గజాల స్థలాన్ని కేటాయించింది.

ఈ స్థలానికి సంబంధించిన పత్రాలను గతంలోనే తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం అందించింది.ఢిల్లీలోని వసంత విహార్ లోని స్థలంలో భూమి పూజ నిర్వహించారు. సుమారు 1100 చ‌ద‌ర‌పు మీట‌ర్ల ప్రాంగ‌ణంలో తెలంగాణ భ‌వ‌న్‌ను నిర్మించ‌నున్నారు. త్రీ ప్ల‌స్ త్రీ రీతిలో భ‌వ‌నాన్ని క‌ట్ట‌నున్నారు. ఇవాళ భూమి పూజ స‌మ‌యంలో ముందుగా సీఎం కేసీఆర్ హోమంలో పాల్గొన్నారు. .

ఢిల్లీలో సొంత కార్యాలయం నిర్మించుకుంటున్న అతికొన్ని ప్రాంతీయ పార్టీల జాబితాలో టీఆర్‌ఎస్‌ చేరుతోంది. వచ్చే ఏడాది దసరాలోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేసి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినేతలను ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలనే యోచ నలో కేసీఆర్‌ ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios