Konijeti Rosaiah Death: రోశయ్య పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళి..

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (Konijeti Rosaiah) పార్థివదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) నివాళులర్పించారు. అమీర్‌పేటలోని రోశయ్య నివాసానికి చేరుకున్న కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

Telangana CM KCR pays tribute to rosaiah

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (Konijeti Rosaiah) పార్థివదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) నివాళులర్పించారు. అమీర్‌పేటలోని రోశయ్య నివాసానికి చేరుకున్న కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. రోశయ్య పార్థివదేహం వద్ద పుష్పగుచ్చంఉంచి నివాళులర్పించారు. రోశయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్ శివార్లలోని కొంపల్లిలో ఉన్న తమ ఫామ్ హౌస్ లో రేపు అంత్యక్రియలను నిర్వహిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ కు రోశయ్య కుటుంబసభ్యులు తెలిపారు. సీఎం కేసీఆర్‌తో వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు అమీర్‌పేటలోని రోశయ్య ఇంటికి చేరుకుని.. ఆయన పార్థివదేహానికి నివాళులర్పిస్తున్నారు.

రోశయ్య మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం..
రోశయ్య మరణవార్త తెలుసుకున్న వెంటనే సీఎం కేసీఆర్ సంతాపం తెలియజేశారు. పలు పదవులకు కొణిజేటి రోశయ్య వన్నె తెచ్చారని కేసీఆర్ అన్నారు. సౌమ్యుడిగా, సహనశీలిగా తనదైన శైలిని ప్రదర్శించారని గుర్తుచేసుకున్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన తెలంగాణ సర్కార్..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతిపై (Konijeti Rosaiah Death) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) సంతాపం తెలిపింది. మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది. డిసెంబర్ 4,5,6 తేదీలను సంతాప దినాలు పాటించాలని ఆదేశించింది. రోశయ్య అంత్యక్రియను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయింది. ఇక, రేపు రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.

 

రోశయ్య మృతి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah Death) ఈరోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం ఆయన పల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే ఆయన మార్గమధ్యలో మృతిచెందారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో రోశయ్య కీలక బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2009 సెప్టెంబర్ 3 నుంచి  2011 జూన్ 25 వరకు రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య.. తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. పలువురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios