వేములవాడ: తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు సోమవారం నాడు వేములవాడ రాజన్నను దర్శించుకొన్నారు. ఆలయ అధికారులు సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు ఉదయం రోడ్డు మార్గంలో వేములవాడకు చేరుకొన్నారు. మార్గమధ్యలో  తెలంగాణ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబసభ్యులను తన వాహనంలో తీసుకొని వెళ్లారు కేసీఆర్.

తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు మార్గమధ్యలో గోదావరి నదికి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వేములవాడకు చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేములవాడలో కుటుంబసభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కేసీఆర్ మిడ్‌మానేరు ప్రాజెక్టును సందర్శించనున్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దీంతో ప్రాజెక్టును సందర్శించనున్నారు కేసీఆర్.