తెలంగాణ సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. ఆదివారం నాడు ఉదయం లష్కర్ బోనాలు ప్రారంభమయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆదివారం నాడు బోనం సమర్పించారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సినిమాటోగ్రపీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్‌కు పూర్ణ కుంభంతో అలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.