తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి రెండు దశాబ్ధాలు పూర్తికానున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేసిన ఆయన... ప్రధాన లక్ష్యమైన రాష్ట్ర సాధనతో పాటు సాధించుకున్న రాష్ట్రంలో అన్ని రంగాల్లో గొప్ప విజయాలను టీఆర్ఎస్ సాధించిందని కేసీఆర్ అన్నారు.

Also Read:సంగారెడ్డి ఇక కరోనా ఫ్రీ జిల్లా: ప్రకటించిన మంత్రి హరీశ్

సంక్షేమం, విద్యుత్, మంచినీరు, సాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో తెలంగాణ గొప్ప విజయాలు నమోదు చేసిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.

ఇది తెలంగాణ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఎంతో గర్వకారణమని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భవించి రెండు దశాబ్ధాలు గడిచిన సందర్భంగా ఎంతో ఘనంగా జరుపువాల్సిన వేడుకలను కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిందని కేసీఆర్ తెలిపారు.

Also Read:తెలంగాణలో తగ్గిన కరోనా... ఇవాళ కేవలం ఏడుగురికి మాత్రమే పాజిటివ్

మరో సందర్భంలో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఎవరికి వారు తమ ప్రాంతాల్లో అత్యంత నిరాడంబరంగా పతాకావిష్కరణ చేసి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

కరోనా నేపథ్యంలో ఖచ్చితంగా లాక్‌డౌన్ నిబంధనలు, ప్రభుత్వం సూచించిన ఇతర మార్గదర్శకాలను పాటించాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. మరోవైపు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 9.30 గంటలకు తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.