సంగారెడ్డి ఇక కరోనా ఫ్రీ జిల్లా: ప్రకటించిన మంత్రి హరీశ్

సంగారెడ్డి కరోనా రహిత జిల్లాగా మారిందని తెలిపారు తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు. జిల్లా పరిధిలో కరోనా పాజిటివ్‌గా తేలిన 8 మంది బాధితులకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

covid 19: Sangareddy district formed as a Corona free district

సంగారెడ్డి కరోనా రహిత జిల్లాగా మారిందని తెలిపారు తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు. జిల్లా పరిధిలో కరోనా పాజిటివ్‌గా తేలిన 8 మంది బాధితులకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

అధికారులు, ప్రజల సమిష్టి కృషితోనే ఇది సాధ్యపడిందని ఆయన వ్యాఖ్యానించారు. వైరస్ కట్టడిలో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన వారితో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని.. ప్రజలెవరూ తప్పుగా భావించొద్దని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.

Also Read:తెలంగాణలో తగ్గిన కరోనా... ఇవాళ కేవలం ఏడుగురికి మాత్రమే పాజిటివ్

ప్రజల శ్రేయస్సు కోసమే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారి.. లాక్‌డౌన్ కారణంగా ఆదాయం తగ్గినప్పటికీ సంక్షేమం విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదని  మంత్రి స్పష్టం చేశారు.

లాక్‌డౌన్ కారణంగా పేదలను ఆదుకునే ఉద్దేశ్యంతో రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల తెల్లరేషన్ కార్డుదారులకు ఇప్పటికే వారి బ్యాంక్ ఖాతాల్లో రూ.1,500 చొప్పున జమచేశామని హరీశ్ రావు చెప్పారు.

Also Read:ఆంధ్రజ్యోతి ఎండీకి కరోనా రావాలన్న కేసీఆర్.. విజయశాంతి చురకలు

ఒకవేళ ఖాతాల్లో డబ్బు పడనివారు ఆధార్, రేషన్ కార్డు తీసుకుని సమీపంలోని పోస్ట్‌ ఆఫీస్‌కి వెళ్లి డబ్బులు తీసుకోవాలని మంత్రి ప్రజలకు సూచించారు. మే నెలలో కూడా 12 కిలోల బియ్యం, రూ.1,500 నగదు అందిస్తామని హరీశ్ స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు తెలంగాణలో 7.50 లక్షల మంది వలస కూలీలకు బియ్యం, రూ.500 నగదు సాయం అందించామని హరీశ్ చెప్పారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యకర్తలు, యువకులు రక్తదానం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios