తెలంగాణలో తగ్గిన కరోనా... ఇవాళ కేవలం ఏడుగురికి మాత్రమే పాజిటివ్

చాలారోజుల తర్వాత తెలంగాణలో అతితక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. 

corona cases decrease in telangana

హైదరాబాద్: కరోనా మహమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు ఫలిస్తున్నట్లున్నాయి. ఇన్నిరోజులూ అంతకంతకూ పెరిగిన కేసులు శనివారం కాస్త తగ్గుముకం పట్టాయి. ఇవాళ కేవలం కొత్తగా ఏడు కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 6, వరంగల్ లో ఒకటి మొత్తంగా ఏడు కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటివరకు కరోనాబారిన పడిన 307  మంది డిశ్చార్జీ అవగా 25మంది మృత్యువాతపడ్డారు. మొత్తంగా ఇప్పటివరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య990 కి చేరింది.  

తెలంగాణలో సగం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 113 కుటుంబాల నుంచే నమోదయ్యాయి. రాష్ట్రంలో  గ్రేటర్ హైదరాబాదులో మొత్తం నమోదయిన వాటిలో 268 కేసులు 44 కుటుంబాల్లో నమోదైనవి కావడం విశేషం.

ఆ కుటుంబాల్లో ముందుగానే కొందరికి కరోనా లక్షణాలు కనిపించినా దాచి పెట్టారు. సమాచారం వైద్య ఆరోగ్య శాఖకు ఇవ్వలేదు. దీంతో వారి కటుంబ సభ్యులకు కూడా కరోనా వైరస్ సోకింది. హైదరాబాదు తర్వాత అత్యధిక కేసులు సూర్యాపేట జిల్లాలో నమోదయ్యాయి. ఆ జిల్లాలో శుక్రవారంనాటికి 83 కేసులు నమోదయ్యాయి. అవన్నీ కేవలం 25 కుటుంబాల నుంచి వచ్చినవే.సూర్యాపేట జిల్లాలో మర్కజ్ లింక్ తో ఒక్కరికి వైరస్ సోకగా ఆ తర్వాత అతడి నుంచి వేగంగా వ్యాప్తి చెందుతూ వచ్చింది. 

జోగులాంబ- గద్వాల జిల్లాలో మొత్తం 49 కేసులు నమోదయ్యాయి. అందులో 45 కేసులు 30 కుటుంబాల నుంచి వచ్చినవే. శుక్రవారం ఈ జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. వికారాబాద్ జిల్లాలో నమోదైన కేసులన్నీ 14 కుటుంబాల నుంచి వచ్చినవే.  ఈ జిల్లాలో ఇప్పటి వరకు 38 కేసులు నమోదయ్యాయి. ఆ రకంగా రాష్ట్రంలోని సగం కేసులు 113 కేసుల నుంచి వచ్చినవే.  కాగా, గత మూడు రోజులుగా రాష్ట్రంలో కేసుల తీవ్రత తగ్గుతూ వస్తోంది.

కుటుంబాల్లో ఇలా వైరస్ కేసులు నమోదయ్యాయి....

హైదరాబాదు 44 కుటుంబాల నుంచి 268 మందికి కరోనా వైరస్
సూర్యాపేట జిల్లాలో 25 కటుంబాల నుంచి 83 మందికి కరోనా వైరస్
గద్వాల జిల్లాలో 30 కుటుంబాల నుంచి 45 మందికి కరోనా వైరస్
వికారాబాద్ జిల్లాలో 14 కుటుంబాల నుంచి 38 మందికి కరోనా వైరస్
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios