ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్న తెలంగాణ సీఎం  కేసీఆర్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అంతకుముందు నక్సల్స్  ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా సమావేశం నిర్వహించారు.

ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అంతకుముందు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నక్సలిజం 23 శాతం, మరణాల సంఖ్య 21 శాతం తగ్గిందని తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి వుందని అమిత్ షా చెప్పారు. కేంద్ర బలగాల కోసం రాష్ట్రాలు భరించే ఖర్చు ప్రధాని తగ్గించారని.. ఇది రూ.2,900 కోట్ల ఖర్చు తగ్గిపోయిందని హోంమంత్రి తెలిపారు. అలాగే హింసాత్మక ఘటనలు 70 శాతం, మృతుల సంఖ్య 82 శాతం తగ్గిందని.. ప్రస్తుతం దేశంలోని 53 జిల్లాల్లోనే మావోయిస్టుల ప్రభావం వుందని అమిత్ షా చెప్పారు. 

ఈ సమావేశానికి ఒడిశా సీఎం నవీన్​పట్నాయక్, తెలంగాణ సీఎం కేసీఆర్‌, బిహార్ ​సీఎం నితీశ్ కుమార్, మధ్యప్రదేశ్ ​సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ఠాక్రే, ఝార్ఖండ్ ​సీఎం హేమంత్​సోరెన్​ హాజరయ్యారు. బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, ఏపీ, కేరళ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, గిరిరాజ్​సింగ్, అర్జున్​ముండా, నిత్యానంద రాయ్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మావోయిస్టులకు సాయం చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవడం సహా భద్రతాపరమైన లోపాలను నివారించాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు.