హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కు విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి ఆహ్వానం అందజేశారు. జూన్ మాసంలో జరగనున్న పీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవానికి హాజరుకావాలని కోరారు. 

ఫిల్మ్ నగర్ లో సన్నిధానంలో స్వరూపనందేంద్ర సరస్వతిని కలిసిన సీఎం కేసీఆర్ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. గతంలో విశాఖపట్నం శారదాపీఠంలో నిర్వహించిన రాజశ్యామల విగ్రహ ప్రతిష్టకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. 

ఈ నేపథ్యంలో శనివారం స్వరూపనందేంద్ర సరస్వతిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. స్వరూపనందేంద్ర సరస్వతి, తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా సేపు ఏకాంతంగా చర్చించారు. ఆధ్యాత్మిక అంశాలతోపాటు రాజకీయ వ్యవహారాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.  అనంతరం జూన్ 15 నుంచి 3 రోజులపాటు విజయవాడలో శారదాపీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకరణకు హాజరుకావాలని కోరారు.  

ఈ వార్తలు కూడా చదవండి

విశాఖశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసిన సీఎం కేసీఆర్