హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు తెలంగాణ గవర్నర్  సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు.. ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో  ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.

Also read:తగ్గని కేసీఆర్, ఆర్టీసీ జేఏసీ ఆగ్రహం: ఢిల్లీలో తేల్చుకునేందుకు వ్యూహం

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎట్‌హోం తర్వాత తొలిసారిగా గవర్నర్ సౌందర రాజన్‌తో భేటీ కావడం ఇదే తొలిసారి.  సమ్మె చేస్తున్న ఆర్టీసీ జేఎసీ నేతలు మూడు దఫాలు గవర్నర్‌ సౌందర రాజన్‌తో భేటీ అయ్యారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా పలు రాజకీయ పార్టీలు కూడ రాజ్ భవన్‌లో గవర్నర్‌తో బేటీ అయ్యారు. ఆర్టీసీ జేఎసీ నేతలు భేషరతుగా తమను విధుల్లోకి తీసుకోవాలని  ప్రభుత్వాన్ని కోరారు. కానీ,ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త రెవిన్యూ చట్టం తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.  మరోవైపు కొత్త రెవిన్యూ చట్టం గురించి కూడ కేసీఆర్ గవర్నర్ తో చర్చించే అవకాశం ఉందంటున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను కూడ నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కేసీఆర్ గవర్నర్ తో చర్చించే అవకాశం ఉంది.

ఆర్టీసీ సమ్మెపై ప్రధానంగా చర్చించే అవకాశం లేకపోలేదు. ఆర్టీసీ సమ్మె విషయంలో  తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆర్టీసీ సమ్మె విషయమై  వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.