హైదరాబాద్: 52 రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇకనైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

విద్యానగర్ లోని ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో విపక్ష పార్టీ నేతలతో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. విపక్ష సభ్యుల కొన్ని సూచనలు చేశారని వారి సూచనలు అనుగుణంగా నడుస్తామని తెలిపారు. 

హైకోర్టు సూచనల మేరకు తాము నడుచుచకుంటామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. మంగళవారం ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చించనున్నట్లు అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఇప్పటికే తమ నిర్ణయాన్ని ఆర్టీసీ ఎండీకి పంపించినట్లు స్పష్టం చేశారు. నిర్ణయం వారి చేతుల్లోనే ఉందన్నారు. 

ఒకవేళ ఢిల్లీ వెళ్తే జంతర్ మంతర దగ్గర ధర్నా చేసేందుకే వెళ్తామని చెప్పుకొచ్చారు. అలాగే కేంద్రమంత్రులను కూడా కలిసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రుల అపాయింట్మెంట్ కోరినట్లు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

సార్ లేరు, కాస్త టైమివ్వండి: ఆర్టీసీ కార్మికుల జీతభత్యాల కేసులో హైకోర్టుకు ప్రభుత్వం వినతి...