హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ తో మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.

సోమవారం సాయంత్రం  న్యూఢిల్లీ నుండి కేసీఆర్ హైద్రాబాద్ తిరిగి వచ్చారు. ఢిల్లీ పర్యటనకు సంబంధించి సీఎం కేసీఆర్ గవర్నర్ తో చర్చించే అవకాశం లేకపోలేదు.

ముఖ్యమంత్రి తరచూడ గవర్నర్ తో తరచూ సమావేశమౌతుంటారు. కానీ, ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది. ఈ సమావేశానికి సంబంధించి ప్రాధాన్యత నెలకొందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.