Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర టూర్ వాయిదా: జూన్ రెండు తర్వాత అన్న హాజారేతో భేటీ


తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన వాయిదా పడింది. జూన్ 2వ తేదీ తర్వాత కేసీఆర్ అన్న హాజారేను కలిసేందుకు మహారాష్ట్ర వెళ్లనున్నారు. 
 

Telangana CM KCR Maharashtra Tour Post Poned To After June 2
Author
Hyderabad, First Published May 27, 2022, 11:18 AM IST

హైదరాబాద్:తెలంగాణ సీఎం KCR మహారాష్ట్ర పర్యటన వాయిదా పడింది.,  ఇవాళ Maharashtra లోని Ralegan Siddhiలో  సామాజిక ఉద్యమ కారుడు అన్న హాజారేను కేసీఆర్ కలవాల్సి ఉంది. 

అయితే  ఇతర షెడ్యూల్ కారణంగా Telangana సీఎం కేసీఆర్ అన్న హాజారేను కలవడం వాయిదా పడింది.  జూన్ రెండవ తేదీ తర్వాత  సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. 

also read:దేశాన్ని రక్షించాలనే కేసీఆర్ యత్నాలు.. కొత్త ఫ్రంట్ అందుకే : కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి

తొలుత నిర్నయించిన మేరకు ఇవాళ ఉదయం మహారాష్ట్రకు వెళ్లాల్సి ఉంది. అయితే ఇతర కార్యక్రమాల నేపథ్యంలో  కేసీఆర్ తన మహారాష్ట్ర పర్యటనను వాయిదా వేసుకున్నారు.  ఈ నెల 26న తెలంగాణ సీఎం కేసీఆర్ మాజీ ప్రధానమంత్రి Deve Gowda తో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై చర్చించారు.

దేశంలో మార్పు తథ్యమని రెండు మూడు నెలల్లో సంచలన వార్త చెబుతానంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. గురువారం బెంగళూరులో జేడీఎస్ అధినేత , మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామిలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశ జీడీపీని సైతం చైనా అధిగమించిందని గుర్తుచేశారు. మనదేశంలో పుష్కలమైన మానవ వనరులు వున్నాయన్నారు. అమోఘమైన యువశక్తి వుందని కేసీఆర్ తెలిపారు. అభివృద్ధిలో చైనా మనదేశాన్ని దాటికి దూసుకుపోతోందన్నారు.

ఇప్ప‌టికే ఎందరో ప్ర‌ధానులు దేశాన్ని ప‌రిపాలించార‌ని, ఎన్నో ప్ర‌భుత్వాలు రాజ్యాన్ని ఏలాయ‌ని, అయినా దేశ ప‌రిస్థితి ఏమాత్రం మార‌లేద‌ని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని సంవ‌త్స‌రాలు గ‌డ‌చినా ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే వుండిపోయింద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. భార‌త్ కంటే త‌క్కువ జీడీపీ వున్న చైనా ఇప్పుడు ఆర్థికంగా ప్ర‌పంచాన్ని శాసిస్తోంద‌ని సీఎం గుర్తుచేశారు. మోదీ ప్ర‌భుత్వం మాత్రం 5 ట్రిలియ‌న్ డాల‌ర్ల బిజినెస్ అంటూ ప్ర‌చారం చేస్తోంద‌న్నారు.  ఇది దేశానికే అవ‌మాన‌మ‌ని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఎవ‌రి సార‌థ్యంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంది అన్న‌ది ఇక్క‌డ ప్ర‌ధానం కాద‌ని సీఎం అన్నారు. 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ దేశంలో మంచినీరు, విద్యుత్, సాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మార్పు వచ్చి తీరుతుందని.. దీనిని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని కేసీఆర్ దుయ్యబట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పడిపోయిందని.. సంకల్పముంటే అమెరికా కంటే బలమైన ఆర్ధికశక్తిగా భారత్‌ను తీర్చిదిద్దొచ్చని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉజ్వల భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

అనంతరం క‌ర్నాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో ప్ర‌త్యామ్నాయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కృషి చేస్తున్న‌ారని తెలిపారు. ప్ర‌త్యామ్నాయ ఫ్రంట్ కోసం అనేక మంది నేత‌లతో కేసీఆర్ భేటీ అవుతున్న‌ట్లు కుమారస్వామి చెప్పారు. ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తున్న‌ట్లు ఆయన తెలిపారు. దేశాన్ని ర‌క్షించుకోవాల‌న్న ఉద్దేశంతో కేసీఆర్ కొత్త ఫ్రంట్‌కు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు కుమార‌స్వామి పేర్కొన్నారు. దేశ ప్ర‌యోజ‌నాల కోసం మార్పు అవ‌స‌రం అని, పేద ప్ర‌జ‌ల కోసం కూడా మార్పు కావాల‌ని కేసీఆర్ ఆకాంక్షిస్తున్నార‌ని ఆయన వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios