హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య:మరో హెలికాప్టర్‌లో దేవరకద్రకు బయలుదేరిన కేసీఆర్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాలుగు సభల్లో  పాల్గొనేందుకు  తెలంగాణ సీఎం కేసీఆర్  ప్లాన్ చేసుకున్నారు. సాంకేతిక సమస్య కారణంగా మరో హెలికాప్టర్ ను తెప్పించుకొని  ఆయన  పాలమూరు పర్యటనకు వెళ్లారు.

Telangana CM KCR leaves For  Devarakadra lns

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్  ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు  సోమవారంనాడు మధ్యాహ్నం  హెలికాప్టర్ లో దేవరకద్రకు బయలుదేరారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ పాలమూరు జిల్లాలోని నాలుగు ఎన్నికల సభల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ ఎన్నికల సభల్లో పాల్గొనేందుకు గాను  తన వ్యవసాయ క్షేత్రం నుండి   కేసీఆర్  ఇవాళ  మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బయలు దేరారు. అయితే  హెలికాప్టర్ బయలుదేరిన కొద్ది క్షణాల్లో  హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది.ఈ సమస్యను  పైలెట్ గుర్తించారు. వెంటనే  హెలికాప్టర్ ను వెనక్కి తిప్పి వ్యవసాయ క్షేత్రంలో  దింపారు.

 మరో హెలికాప్టర్ కోసం  బీఆర్ఎస్  నేతలు  ఎన్నికల సంఘాన్ని కోరింది.ఈ మేరకు  ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.  ప్రతి రోజూ ఉపయోగించే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య ఏర్పడిన విషయాన్ని  బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వచ్చారు.  

సాంకేతిక సమస్య వచ్చిన హెలికాప్టర్ ను మరమ్మత్తులు నిర్వహించనున్నారు. మరో వైపు మరో హెలికాప్టర్ ను  వ్యవసాయ క్షేత్రానికి రప్పించారు. కొత్తగా తీసుకు వచ్చిన హెలికాప్టర్ లో  దేవరకద్రలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ బయలుదేరి వెళ్లారు.

తెలంగాణ రాష్ట్రంలో మూడో దఫా అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బీఆర్ఎస్ ఉంది. ఆ పార్టీ చీఫ్ కేసీఆర్  ప్రతి రోజూ  మూడు ఎన్నికల  ప్రచార సభల్లో  పాల్గొంటున్నారు.ఇవాళ పాలమూరు జిల్లాలో నాలుగు ఎన్నికల ప్రచార సభల్లో  కేసీఆర్ పాల్గొంటారు.  ప్రతిరోజూ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రాష్ట్ర వ్యాప్తంగా  ఎన్నికల ప్రచార తీరు తెన్నులను  కేసీఆర్  పరిశీలిస్తున్నారు.

ఆయా నియోజకవర్గాల్లో  పార్టీ పరిస్థితులపై  సమీక్షిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు  ఎన్నికల ప్రచారసభలకు వెళ్తున్నారు. ఎన్నికల ప్రచార సభల నుండి వచ్చిన తర్వాత   నేరుగా ఆయా నియోజకవర్గాల అభ్యర్ధులతో కేసీఆర్ ఫోన్ లో మాట్లాడుతున్నారు. సర్వే రిపోర్టుల ఆధారంగా  ఆయా  ప్రాంతాల్లోని పరిస్థితిపై  అభ్యర్ధులకు సమాచారం అందిస్తున్నారు.

also read:సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య.. పూర్తి వివరాలు ఇవే..

ఇదిలా ఉంటే  ఈ దఫా  తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు కూడ పట్టుదలగా ఉన్నాయి. కర్ణాటకలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో  అదే తరహా ఫార్మూలాను  తెలంగాణలో అమలు చేస్తుంది ఆ పార్టీ. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన  అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లు రాష్ట్రంలో విస్తృతంగా  ప్రచారంలో పాల్గొననున్నారు.  మరోవైపు బీజేపీ అగ్రనేతలు కూడ రాష్ట్రంలో విస్తృతంగా  ప్రచారంలో పాల్గొననున్నారు.  రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.ఈ నెల  11న కూడ మోడీ ఎన్నికల ప్రచాంలో పాల్గొనేలా బీజేపీ ప్లాన్ చేసింది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios