Asianet News TeluguAsianet News Telugu

టీ హబ్ -2.0: ప్రారంభించిన తెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ టీ హబ్ 2 ను ప్రారంభించారు. జూలై 1 వ తేదీనుండి స్టార్టప్ లు కొత్త భవనంలో తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. 

Telangana CM KCR  launches T-Hub 2.0 in Hyderabad
Author
Hyderabad, First Published Jun 28, 2022, 5:24 PM IST

హైదరాబాద్: T-Hub  ను తెలంగాణ సీఎం KCR  మంగళవారం నాడు సాయంత్రం ప్రారంభించారు. ఈ ఏడాది జూలై 1 వ తేదీ నుండి స్టార్టప్ లు కొత్త భవనంలో తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. టీ హబ్ ను ప్రారంభించిన తర్వాత కేసీఆర్  భవనాన్ని పరిశీలించారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాంగణంగా టీ హబ్ రూపుదిద్దుకుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. Hyderabad రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో రూ. 400 కోట్లతో టీ హబ్ -2 ను ప్రారంభించారు.53.65 మీటర్ల ఎత్తు, రెండు బేస్ మెంట్లు, 10 అంతస్థులతో టీ హబ్ -2  నిర్మించారు. 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్ -2 నిర్మించారు.  2015లో స్టార్టప్‌లను ప్రభుత్వ పరంగా ప్రోత్సహించేందుకు ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఐటీ హబ్ ప్రస్థానం ప్రారంభమైంది.స్టార్టప్స్‌ కార్యకలాపాలకు వేదిక అయ్యేలా ఈ రెండో టీ హబ్‌ను నిర్మించింది తెంగాణ ప్రభుత్వం. అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన టీ హబ్‌ 2.0  దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సెంటర్ గా రికార్డు సృష్టించనుందని ప్రభుత్వ వర్గాలు ధీమాతో ఉన్నాయి.

మొదటి టీ హబ్‌ను 2015లో  హైదరాబాద్‌ లో తెలంగాణ ప్రభుత్వం  ప్రారంభించింది.  దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి టీ హబ్ ద్వారా వచ్చిన రెస్పాన్స్ తో పాటు  పలువురి నుండి వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా  టీ హబ్‌ 2.0కు ప్లాన్‌ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మొదటి టీ హబ్ కంటే మరిన్ని సౌకర్యాలతో తెలంగాణ ప్రభు్వం రెండోొ టీ హబ్ కు ప్లాన్ చేసింది. టీ హబ్  2 ఈ బిల్డింగ్‌ను 10 అంతస్తులతో నిర్మించారు. తెలంగాణ రాష్ట్రం ఐటీ ఎశాఖ మంత్రి కేటీఆర్ టీ హబ్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ నేతృత్వంలోని అధికారుల బృందం టీ హబ్ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios