తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించి నేషనల్ హెల్త్ అథారిటీతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఎంవోయూ కుదుర్చుకుంది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించి నేషనల్ హెల్త్ అథారిటీతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. తద్వారా ఆయుష్మాన్ భారత్ విధివిధనాలు ఖరారు చేయాల్సిందిగా.. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.