కరోనాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. కోవిడ్ కట్టడికి చేపట్టిన జ్వరం సర్వే విజయవంతమైందని సీఎం గుర్తుచేశారు. మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాల్లో జ్వరం సర్వేను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

కరోనా వ్యాప్తికి కారణాలు గుర్తించలేకపోతున్నామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కరోనా అనేది అంతుచిక్కని సమస్యగా మారిందన్నారు. కోవిడ్ నియంత్రణకు నిర్దిష్టమైన అవగాహన కరువైందని కేసీఆర్ పేర్కొన్నారు. ఏ వేవ్ , ఏ వేరియంట్ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదన్నారు. ఏ రోగానికైనా కారణం తెలిస్తే నివారణ చేయొచ్చునని.. కరోనా నియంత్రణ సంక్షిష్టంగా మారిందన్నారు కేసీఆర్. కోవిడ్ కట్టడికి చేపట్టిన జ్వరం సర్వే విజయవంతమైందని సీఎం గుర్తుచేశారు.

Also Read:నిరుద్యోగులకు శుభవార్త: తెలంగాణలో 50 వేల ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాల్లో జ్వరం సర్వేను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా ఇంకా పూర్తి స్థాయిలో నియంత్రణలోకి రాలేదని సీఎం అన్నారు. అలాగే సరిహద్దు జిల్లాల్లో కూడా కోవిడ్ ముప్పు సమసిపోలేదని వ్యాఖ్యానించారు. కరోనా విస్తరణకు గల కారణాలను క్రిటికల్ అనాలిసిస్ చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో కరోనా ప్రభావిత జిల్లాల్లో అధికారులు పర్యటించాలని కేసీఆర్ సూచించారు.