Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ సచివాలయం: పనులను పరిశీలించిన కేసీఆర్

తెలంగాణ సచివాలయాన్ని వచ్చే నెల  17న ప్రారంభించనున్నారు. సచివాలయ నిర్మాణ పనులను కేసీఆర్ ఇవాళ పరిశీలించారు. 

Telangana CM KCR Inspects  New Secretariat Building  work
Author
First Published Jan 24, 2023, 3:18 PM IST

హైదరాబాద్: తెలంగాణ సచివాలయ పనులను సీఎం కేసీఆర్ మంగళవారం నాడు పరిశీలించారు. వచ్చే నెల  17న  కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో  సచివాలయ నిర్మాణ పనులను కేసీఆర్  ఇవాళ పరిశీలించారు.

వచ్చే నెల  17వ తేదీన  తెలంగాణ కొత్త సచివాలయాన్ని  ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.   ఫిబ్రవరి 17వ తేదీ కేసీఆర్ పుట్టిన రోజు. కేసీఆర్ పుట్టిన రోజునే కొత్త సచివాలయ పనులను  ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు  ఈ నెల  15వ తేదీన ఈ నిర్ణయం తీసుకున్నారు.   సచివాలయంలో  అసంపూర్తిగా  ఉన్న  కొన్ని పనులను  10 రోజుల్లోనే  పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి  సమీక్ష నిర్వహించారు. కొత్త సచివాలయ నిర్మాణ పనులను  కేసీఆర్   ఇవాళ పరిశీలించారు.

కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి  తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్  సీఎం  హేమంత్ సోరేన్, బీహర్ ఉప ముఖ్యమంత్రి  తేజస్వి యాదవ్ , జేడీ(యు) అద్యక్షుడు లలన్ సింగ్ , అంబేద్కర్ మనుమడు  ప్రకాష్ అంబేద్కర్ లు హజరు కానున్నారు.  తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని  ప్రజా యుద్ధనౌక గద్దర్  సీఎం కేసీఆర్ ను కోరారు. ఈ మేరకు  తెలంగాణ సచివాలయానికి  అంబేద్కర్ భవన్ గా  నామకరం చేసింది ప్రభుత్వం.   దీంతో  ఈ సచివాలయ ప్రారంభోత్సవం రోజు  అంబేద్కర్ మనుమడిని ూడా  ఆహ్వానించారు. 

also read:ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయ ప్రారభోత్సవం: హజరు కానున్న తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు

తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం  రోజున ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కొత్త సచివాలయానికి  తొలుత వాస్తు పూజ నిర్వహిస్తారు. ఆ తర్వాత సుదర్శన యాగం, చండీ యాగాలు నిర్వహిస్తారు.  ఈ యాగాలు పూర్తైన తర్వాత  సచివాలయాన్ని ప్రారంభించనున్నారు.కొత్త సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తైన  తర్వాత  సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్ లో  సభ ను నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.   రెండు రాష్ట్రాల సీఎంలు ఈ సభలో పాల్గొంటారు. 

Follow Us:
Download App:
  • android
  • ios