పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించిన కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. నార్లాపూర్ తొలిపంపు స్విచ్ ఆన్ చేసిన కేసీఆర్ నీటిని విడుదల చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. నార్లాపూర్ తొలిపంపు స్విచ్ ఆన్ చేసిన కేసీఆర్ నీటిని విడుదల చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా కృష్ణానది నుంచి కోతిగుండు ద్వారా నీటిని తీసుకునేలా ప్రాజెక్ట్‌ను నిర్మించింది ప్రభుత్వం. రోజుకు 1.5 టీఎంసీలు లిఫ్ట్ చేసేలా ఎత్తిపోతలు, 6 జలాశయాల నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్ట్ మొత్తం నిల్వ సామర్ధ్యం 67.52 టీఎంసీలు కాగా.. 672 మీటర్ల లిఫ్ట్, 61.57 కి.మీ సొరంగ, 915 కి.మీ ప్రాథమిక కాలువ నిర్మించారు.