నాగర్ కర్నూలు జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. 

నాగర్ కర్నూలు జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం కలెక్టర్ ఉదయ్ కుమార్‌ను ఛాంబర్‌లో కూర్చొండబెట్టారు. అంతకుముందు కలెక్టరేట్ వద్ద పోలీసు బలగాల నుంచి కేసీఆర్ గౌరవ వందనం స్వీకరించారు. నాగర్ కర్నూలు మున్సిపాటిలీ పరిధిలోని దేశిటిక్యాల శివారులోని కొల్లాపూర్ చౌరస్తాలో 12 ఎకరాల స్థలంలో రెండు అంతస్తుల్లో కలెక్టరేట్‌ను నిర్మించారు. రూ. 52 కోట్లతో ఈ భవనాన్ని నెలకొల్పారు. మొత్తం 32 శాఖల కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి.