మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ గురువారం ప్రారంభించారు. మరోవైపు అక్కడ గత నెల 22న ప్రారంభమైన సభ్యత్వాల నమోదు కార్యక్రమం ఈ నెల 22 వరకు కొనసాగనుంది.
దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని భావిస్తున్న బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్.. పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్యాలయాలను ఆయన ప్రారంభిస్తూ వస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ గురువారం ప్రారంభించారు. తొలుత ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించారు. త్వరలో ముంబై, పూణే, ఔరంగాబాద్, నాందేడ్‌లలోనూ బీఆర్ఎస్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు.
మరోవైపు.. మహారాష్ట్రలో బీఆర్ఎస్ వేగంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే అక్కడ 3.5 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదం నేతృత్వంలో కిసాన్ సెల్ ద్వారా 2 లక్షల సభ్యత్వాలు నమోదు కాగా.. ఇతర అనుబంధ సంఘాల ద్వారా మరో 1.50 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. గత నెల 22న ప్రారంభమైన సభ్యత్వాల నమోదు కార్యక్రమం ఈ నెల 22 వరకు కొనసాగనుంది.
