Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్‌

తెలంగాణలోని రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు.  ఈ నెల అంటే డిసెంబర్ 27వ తేదీ నుంచి వచ్చే నెల అంటే జనవరి 7వ తేదీ వరకు రైతులకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. 

telangana cm kcr good news to farmers - bsb
Author
Hyderabad, First Published Dec 7, 2020, 5:10 PM IST

తెలంగాణలోని రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు.  ఈ నెల అంటే డిసెంబర్ 27వ తేదీ నుంచి వచ్చే నెల అంటే జనవరి 7వ తేదీ వరకు రైతులకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. 

రాష్ట్రంలో ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ సాయం అందించాలని సిఎం  అధికారులను ఆదేశించారు. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలని చెప్పారు. దీనికోసం అవసరమైన రూ.7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. 

తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి, ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు అందరికీ పది రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలని చెప్పారు.  రెండో విడత యాసంగి సీజన్ రైతుబంధు సహాయంపంపిణీకి సంబంధించి అధికారులతో సిఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. 

వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుబంధు సహాయం పంపిణీకి అనుసరించాల్సిన విధానంపై చర్చించి, కార్యాచరణను ఖరారు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios