Asianet News TeluguAsianet News Telugu

ఆ పార్టీదే మోసపు చరిత్ర: మంథని సభలో కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్

ఎన్నికల సభల్లో  తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేసిందో  కాంగ్రెస్ పై  కేసీఆర్  విమర్శల దాడిని తీవ్రతరం చేశారు.

Telangana CM KCR  Fires on  Congress In Mandhani Sabha lns
Author
First Published Nov 7, 2023, 5:05 PM IST

మంథని: తెలంగాణ విషయంలో  కాంగ్రెస్ మోసం చేసిందని  తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు.  1969లో  ఉద్యమం చేసిన వారిని కాల్చి చంపిన  చరిత్ర ఆ పార్టీదేనన్నారు.  మంగళవారంనాడు  మంథనిలో నిర్వహించిన  బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు. 

మంథనిలో  బరిలో దింపిన బీసీ బిడ్డ పుట్ట మధును గెలిపించాలని  తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. 1969లో  ఇడ్లీ, సాంబార్ గో బ్యాక్ ఉద్యమం నిర్వహిస్తే  కాల్చి చంపిన చరిత్ర  కాంగ్రెస్ దేనని  ఆయన గుర్తు చేశారు.ఉన్న తెలంగాణను ఊడగొట్టిన చరిత్ర కాంగ్రెస్ దేనన్నారు.తమ పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇవ్వకుండా  ఆలస్యం చేసిందన్నారు. చివరకు తాను  దీక్ష చేస్తే  విధిలేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని ఆయన కాంగ్రెస్ పై విమర్శలు చేశారు.

గిరిజన, ఆదివాసీల విషయంలో కాంగ్రెస్ సరైన విధానాలు అవలంభించలేదన్నారు. రైతులు, దళితులు, గిరిజనుల గురించి కాంగ్రెస్ ఆలోచించి ఉంటే దేశ పరిస్థితి ఇలా ఎందుకు ఉండేదని ఆయన ప్రశ్నించారు. పార్టీల చరిత్రలు చూసి ఓటేయాల్సిన అవసరం ఉందన్నారు.  పీవీ మొదలుపెట్టిన  రింగ్ రోడ్డును పుట్టమధు పూర్తి చేశారన్నారు. జనం గెలిచే ప్రజాస్వామ్య ప్రక్రియ రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

రైతుబంధు ఆపాలని  ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరుతున్నారన్నారు.రైతు బంధు కింద డబ్బులు అనవసరంగా ఖర్చు చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి  చెబుతున్నారన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కంటే  ఎక్కువ విద్యుత్ అవసరం లేదని రేవంత్ రెడ్డి కోరుతున్నారని  కేసీఆర్ గుర్తు చేశారు. మరోవైపు ధరణిని కూడ ఎత్తివేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు.  కాంగ్రెస్ నేతలు గొడ్డలి పట్టుకుని తిరుగుతున్నారన్నారు.

 పొరపాటున తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  ఉచిత కరెంట్, రైతు బంధు, ధరణి ఎత్తివేస్తారన్నారు.ధరణి తీసివేస్తే  రైతుబంధు ఎలా వస్తుందని ఆయన  ప్రశ్నించారు. మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని కేసీఆర్ చెప్పారు.దేశంలో  తెలంగాణలోనే  వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రధాని మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్ లో కూడ 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదన్నారు. 

also read:సూట్‌కేసులు పట్టుకొని వచ్చేవాళ్లకు బుద్ది చెప్పాలి: మందమర్రి సభలో వివేక్ వెంకటస్వామి పై కేసీఆర్

మంథనిలో  బీసీ బిడ్డను గెలిపించాలని మంథని ప్రజలతో పంచాయితీ పెట్టుకుంటానన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధికి టిక్కెట్టు దక్కిన చోట  ఆ అభ్యర్ధిని గెలిపించుకొనేందుకు బీసీలు కృషి చేయాలని సీఎం కోరారు. బీసీలకు  వచ్చే అవకాశాలే తక్కువ.  వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని కేసీఆర్ కోరారు. బీసీ నాయకుడిని ఎందుకు  ఇబ్బంది పెట్టాలని ఆయన ప్రశ్నించారు. ప్రజల్లో ఉండే పుట్ట మధును గెలిపించాలని ఆయన కోరారు. ఓటు వేసే ముందు ఆలోచించాలని ఆయన ప్రజలను కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios