Asianet News TeluguAsianet News Telugu

ప్రగతి భవన్‌లో వినాయక చవితి వేడుకలు.. కేసీఆర్ కుటుంబం పూజలు

వినాయక చవితి పర్వదినం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తన అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  కేసీఆర్ , శోభ దంపతులతో పాటు కేటీఆర్, శైలిమ దంపతులు పూజలు నిర్వహించారు. 

telangana cm kcr family performs vinayaka chavithi pooja at pragathi bhavan ksp
Author
First Published Sep 18, 2023, 9:18 PM IST

వినాయక చవితి పర్వదినం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తన అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మట్టి గణపతిని ఏర్పాటు చేసి.. ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. అనంతరం కేసీఆర్ , శోభ దంపతులతో పాటు కేటీఆర్, శైలిమ దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఇకపోతే.. తెలంగాణ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాల శోభ సంతరించుకుంది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ మహాగణపతి వద్ద భక్తుల సందడి నెలకొంది. ఈరోజు ఖైరతాబాద్ గణనాథునికి తొలిపూజను వైభవంగా నిర్వహించారు. ఈ పూజలో తెలంగాణ, హర్యానా గవర్నర్లు తమిళిసై సౌందర్‌రాజన్, బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం  నాగేందర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గణనాథునికి పట్టువస్త్రాలు సమర్పించారు. 

 

 

అనంతరం గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని  అన్నారు. తెలంగాణ ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని  వినాయకుడిని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. ఇది ఆధ్యాత్మిక ప్రదేశమని.. ఏర్పాట్లు చాలా బాగున్నాయని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios