Asianet News TeluguAsianet News Telugu

కొత్తపల్లి ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి... మృతులు ఒక్కొక్కరికి రూ.5లక్షల ఆర్థికసాయం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకున్న దుర్ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.   

telangana cm kcr expresses shock over kothapalli incident
Author
Gadwal, First Published Oct 10, 2021, 12:32 PM IST

గద్వాల: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలో బాగా తడిసిన ఇంటిగోడలు కూలి ఓ కుటుంబం బలయిన విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి నిరంజన్ రెడ్డికి ఫోన్ చేసి దుర్ఘటనపై ఆరాతీసారు కేసీఆర్.

kothapally accident లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందినట్లు తెలుసుకుని విచారం వ్యక్తం చేసిన KCR మృతులు ఒక్కొక్కరికీ రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించాలని మంత్రికి సూచించారు. సీఎం ఆదేశాలతో వ్యవసాయశాఖ మంత్రి niranjan reddy రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 

''కొత్తపల్లి ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం. మృతుల కుటుంబంలో మిగతా వారికి ప్రభుత్వపరంగా వైద్య సౌకర్యాలు కల్పిస్తాం. ఆ తర్వాత కూడా అన్ని రకాలుగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం'' అని మంత్రి వెల్లడించారు. 

 ఇటీవల భారీ వర్షాలు కురిస్తున్న నేపథ్యంలో శిథిలావస్తలో వున్న పురాతన భవనాల్లో నివాసముంటున్న కుటుంబాలు జాగ్రత్తగా వుండాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, నిర్మాణాలను అధికారులు గుర్తించాలని సూచించారు. ప్రజలను సురక్షిత స్థావరాలకు తరలించాలని అధికారులను మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. 

read more  పెద్దపల్లి జిల్లాలో విషాదం... గోదావరిలో దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య

కొత్తపల్లి గ్రామానికి చెందిన మోషను-శాంతమ్మ దంపతులు.వీరికి ఐదుగురు సంతానం. అయితే వీరు ఇంట్లో నిద్రిస్తుండగా ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున ఇంటిగోడ కూలింది. దీంతో నిద్రలోనే ఐదుగురు ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

భార్యాభర్తలు శాంతమ్మ,మోషలతో పాటు పిల్లలు  తేజ, చరణ్ , రామ్, మరణించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు పిల్లలు స్నేహా, చిన్నాలకు తీవ్ర గాయాలయ్యాయి.  గాయపడిన ఇద్దరు చిన్నారులను గద్వాల ఆసుపత్రికి తరలించారు.స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్లలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios