ఒమిక్రాన్ ఎఫెక్ట్:ఈ నెల 8 నుండి 16 వరకు తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనాపై తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: ఈ నెల 8వ తేదీ నుండి 16వ తదీ వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కరోనాపై తెలంగాణ సీఎం Kcr సోమవారం నాడు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యా సంస్థలకు Holidays ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో Omicron కేసులు పెరిగిపోతున్నాయి. అంతేకాదు corona కేసులు సాధారణం కంటే పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలలువు ఇచ్చినట్టుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
Telangana రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 4,048కి చేరుకొన్నాయి. ఒమిక్రాన్ కేసులు 84కి చేరుకొన్నాయి. విదేశాల నుండి వచ్చిన ప్రయాణీకుల కారణంగా రాష్ట్రంలో కరోనా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. సీఎం కేసీఆర్ ఇవాళ ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మంత్రి హరీష్ రావు సహా వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సీఎం సుదీర్ఘంగా ఈ విషయమై చర్చించారు.
also read:బండి సంజయ్ దీక్షకు భయమెందుకు: టీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
రానున్న రెండు వారాల్లో ఒమిక్రాన్ కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. సంక్రాంతి పర్వదినానికి తక్కువ రోజులే సెలవులు ఇవ్వాలని భావించారు. అయితే కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని సెలవులను పెంచాలని అధికారులు భావించారు. దీంతో ఈ నెల 8 నుండి 16వ తేదీ వరకు సెలవులను ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు.
లాక్ డౌన్ అవసరం లేదని సీఎం నివేదిక
రాష్ట్రంలో ప్రస్తుతానికి లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదని కూడా అధికారులు సీఎం కేసీఆర్ కు నివేదిక అందించారు. అయితే ఒమిక్రాన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రస్తావించారు. మాస్క్ లు ధరించకపోతే కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా చూడాలన్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా చూడాలన్నారు.
స్కూల్స్, కాలేజీలు, ఇతర విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులు, పిల్లలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. కోవిడ్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తులు మాస్క్ ధరించకపోతే రూ.1,000 జరిమానా విధిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. సీనియర్ సిటిజన్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. కోవిడ్ -19 రూల్స్ కచ్చితంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్‌లను, పోలీసు సూపరింటెండెంట్‌లను ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. ర్యాలీలు, బహిరంగ సభలు, మత, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్ని రకాల సామూహిక కార్యక్రమాలను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.