Asianet News TeluguAsianet News Telugu

K Chandrashekar Rao : అసైన్డ్ భూములపై రైతులకు హక్కు కల్పిస్తాం , కాంగ్రెస్‌కు కేసీఆర్ కౌంటర్

బీఆర్ఎస్ పార్టీ నేతలు ఢిల్లీ గులాములు కాదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బాసులని, మాకు ఏదైనా చెప్పేది ప్రజలేనని పేర్కొన్నారు. అసైన్డ్ భూములు లాక్కొంటుందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని..  ఈ భూములపై రైతులకు పూర్తి స్థాయిలో హక్కులు కల్పిస్తామని కేసీఆర్ చెప్పారు.

telangana cm kcr counter to congress party on assigned lands at brs praja ashirvada sabha in patancheru ksp
Author
First Published Nov 23, 2023, 7:37 PM IST

బీఆర్ఎస్ పార్టీ నేతలు ఢిల్లీ గులాములు కాదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పటాన్ చెరులో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బాసులని, మాకు ఏదైనా చెప్పేది ప్రజలేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలకు కరెంట్ సరిగా వుండేది కాదని సీఎం ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పుట్టిందే ప్రజల కోసం, తెలంగాణ హక్కుల కోసమన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, పదేళ్ల బీఆర్ఎస్ పాలన మధ్య తేడాను గమనించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పటాన్ చెరు ప్రాంతాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దుతామని సీఎం వెల్లడించారు. 

ఎన్నికలు రాగానే ఇష్టమొచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. యూరప్ దేశాల్లో మనలాగా బహిరంగ సభలు జరగవని.. మనదేశంలో రావాల్సినంత పరిణతి రాలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలన చూసి , టీవీల్లో నేతలు చెప్పేది విని ప్రజలు నిర్ణయం తీసుకుంటారని కేసీఆర్ చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్ధులతో పాటు వారి చరిత్ర కూడా చూడాలని .. పార్టీలు గెలిస్తే ఏం చేస్తాయో ఆలోచించి ఓటు వేయాలని సీఎం సూచించారు. 

Also Read: K Chandrashekar Rao : ధరణి వుండాలంటే బీఆర్ఎస్ మళ్లీ రావాల్సిందే : కేసీఆర్

రైతుబంధు ఇచ్చి ప్రజల డబ్బు వృథా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు ఉంచడమే కాకుండా రూ.16 వేలకు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. అసైన్డ్ భూములు లాక్కొంటుందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని..  ఈ భూములపై రైతులకు పూర్తి స్థాయిలో హక్కులు కల్పిస్తామని కేసీఆర్ చెప్పారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios