తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. కరుణానిధి మరణం భారతదేశ రాజకీయ రంగానికి తీరని లోటని.. సామాన్యులకు రాజకీయాల పట్ల అవగాహన కలిగించిన కొద్దిమంది నేతల్లో కరుణానిధి ఒకరని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సీఎం చెన్నైకి వెళ్లనున్నారు.