యాదాద్రి జిల్లా వలిగొండ వద్ద జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో 16 మంది మరణించిన దుర్ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంతో పాటు అనేకమంది గాయపడటం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని.. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.