Asianet News TeluguAsianet News Telugu

రూ.50 లక్షలు, రిటైర్‌మెంట్ వరకు జీతభత్యాలు, ఒకరికి ప్రభుత్వోద్యోగం : శ్రీనివాసరావు మరణంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూములను రక్షించడానికి వెళ్లి గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

telangana cm kcr condolence message to forest range officer srinivasa rao death
Author
First Published Nov 22, 2022, 6:21 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూములను రక్షించడానికి వెళ్లిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గుత్తికోయల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికార లాంఛనాలతో శ్రీనివాసరావు అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు కేసీఆర్. దీనితో పాటు శ్రీనివాసరావు కుటుంబానికి పూర్తి జీతభత్యాలు చెల్లించాలని.. రిటైర్‌మెంట్ వయస్సు వరకు కుటుంబ సభ్యులకు వేతనం చెల్లించాలని సీఎం ఆదేశించారు. అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. ఉద్యోగులపై దాడులను సహించేది లేదని కేసీఆర్ హెచ్చరించారు. ఈ ఘటనకు కారణమైన దోషులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

కాగా... మంగళవారం పోడు భూములకు సంబంధించి గుత్తికోయలకు , ఫారెస్ట్ అధికారులకు మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాడికి గురైన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. చండ్రగుంట మండలం బెండలపాడులో ఈ ఘటన జరిగింది. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌ను వెంటాడి వేట కొడవళ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోన్న శ్రీనివాస్‌ను హుటాహుటిన కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావు పరిస్ధితి ప్రస్తుతం విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనను కొత్తగూడెం నుంచి ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

Also REad:మాకూ ఆయుధాలివ్వండి.... రేంజర్‌ హత్యతో అటవీశాఖ సిబ్బంది ఆందోళన

బెండలపాడు సమీపంలోని ఎర్రగూడు అటవీప్రాంతంలో గతంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనుల భూముల్లో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటారు. ఈ నాటిన మొక్కల్ని తొలగించడానికి గిరిజనులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో పలుమార్లు ఫారెస్ట్ అధికారులకు, పోడు రైతులకు మధ్య గొడవ జరిగింది. గతంలో లాఠీఛార్జ్ సైతం చేశారు. తాజాగా ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ మళ్లీ భూముల్లో అధికారులను నాటిన మొక్కల్ని ధ్వంసం చేశారు గుత్తికోయలు. దానిని అడ్డుకునే క్రమంలో అధికారులు, గిరిజనులకు మధ్య వాగ్వాదం జరిగింది.  ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుపై గిరిజనులు వేట కొడవళ్లతో దాడులు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios